Anand mahindra about investment in cryptocurrency: మహీంద్రా గ్రూప్ సంస్థల అధినేత.. ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ద్వారా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక, సమకాలని అంశాలపై ఎప్పుడు యాక్టివ్‌గా స్పందించే ఆనంద్ మహీంద్రా ఆయన గురించి (Anand mahindra About Fake news on him) వస్తున్న అసత్య వార్తల గురించి స్పందించారు.
ఇంతకీ ఏమైందంటే..
ఆనంద్ మహీంద్రా క్రిప్టో కరెన్సీల్లో భారీగా పెట్టుబడులు పెట్టారని ఆన్లైన్లో వార్తలు (Fake news on Anand mahindra) చక్కర్లు కొట్టాయి. అంతేకాదు క్రిప్టో కరెన్సీల నుంచి డబ్పులు ఎలా సంపాదించాలో కూడా సలహాలు ఇస్తున్నారంటూ ఆ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ వార్తలపై ట్విట్టర్ ద్వారా స్వయంగా క్లారిటీ ఇచ్చారు అనంద్ మహీంద్ర. తాను కిప్టో కరెన్సీల్లో ఒక్క రూపాయి కూడా పెట్టలేదని తెలిపారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టారంటూ వస్తున్న వార్తలన్ని అవాస్తవమని స్పష్టం చేశారు.
'ఇది చాలా ప్రమాదకరమైంది. వాస్తవానికి ప్రమాదకరం కాకుంటే.. ఇది వినోదభరితంగానే ఉండేది. ఎవరో దీన్ని ఆన్లైన్లో చూసి నన్ను అలర్ట్ చేశారు. దీనిపై అందరికీ నేను స్పష్టత ఇవ్వదలచుకున్నా. ఇది పూర్తిగా అవాస్తవం, మోసపూరితమైన వార్తలు. నకిలీ వార్తలను మరోస్థాయికి తీసుకెళ్లారు. నేను క్రిప్టోల్లో ఒక్క రూపాయి కూడా పెట్టుబడిగా పెట్టలేదు.' అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు నకిలీ వార్తలున్న స్క్రీన్ షాట్లను కూడా జోడించారు.
This would be highly amusing if it wasn’t so unethical &, in fact, dangerous. Someone saw this online & alerted me. I need to make people aware that this is completely fabricated & fraudulent. Takes fake news to a new level. Ironically, I’ve not invested a single rupee in cryptos pic.twitter.com/cfWRDY1J88
— anand mahindra (@anandmahindra) November 19, 2021
Also read: త్వరలో పన్ను పరిధిలోకి 'క్రిప్టో' ఆదాయం- బడ్జెట్లో చట్ట సవరణ!
Also read: కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు, వాటి ఫీచర్స్, ధరలు, కెమెరా సెటప్ డీటేల్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook