Netflix charges: నెట్​ఫ్లిక్స్​ పాస్​వర్డ్ షేర్​ చేస్తే ఇక ఛార్జీల మోత- త్వరలో కొత్త రూల్స్!

Netflix charges: ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ నెట్​ఫ్లిక్స్​ యూజర్లకు షాకివ్వనుంది. అకౌంట్ షేర్​ చేసినా.. అదనపు ఛార్జీలు చెల్లించే విధంగా మార్పులు తేనున్నట్లు తెలుస్తోంది. ఛార్జీలు ఎంత ఉండనున్నాయంటే..

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 18, 2022, 03:56 PM IST
  • నెట్​ఫ్లిక్స్​లో కొత్త ఛార్జీలు
  • అకౌంట్ షేర్ చేసినా బాదుడు
  • త్వరలో కొత్త నిబంధనలు
Netflix charges: నెట్​ఫ్లిక్స్​ పాస్​వర్డ్ షేర్​ చేస్తే ఇక ఛార్జీల మోత- త్వరలో కొత్త రూల్స్!

Netflix charges: ఓటీటీలకు ఇటీవల విపరీతమైన డిమాండ్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్​, నెట్​ఫ్లిక్స్​, హాట్​స్టార్ వంటి ఇంటర్నేషనల్ సంస్థలతో పాటు.. దేశీయంగా కూడా అనేక ఓటీటీ ప్లాట్​ఫామ్స్​ సేవలందిస్తున్నాయి. కరోనా కారణంగా కొత్త సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్​ అవ్వడం సాధారణమైంది. దీనితో ఓటీటీ సబ్​స్క్రిప్షన్​లు భారీగా పెరిగాయి.

అయితే చాలా మంది ఫ్యామిలి, ఫ్రెండ్స్​లో ఎవరో ఒకరు మాత్రమే సబ్​స్క్రిప్షన్ తీసుకుని ఇతరులతో పాస్​వర్డ్​లు షేర్​ చేసుకుంటున్నారు. దీనితో ఒకే సబ్​స్క్రిప్షన్​పై చాలా మంది సినిమాలు, షోలు చూడటం వంటివి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల వల్ల నష్టపోతున్నామనే కారణంతో నెట్​ఫ్లిక్స్​ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఫ్యామిలీ మెంబర్స్​ కాకుండా ఇతరులకు.. నెట్​ఫ్లిక్స్​ పాస్​వర్డ్​ షేర్ చేస్తే ఛార్జీలు వసూలు చేయాలని భావిస్తోందట. ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేసి.. ఆ తర్వాత అందరికీ దీనిని వర్తింపజేయనున్నట్లు సమాచారం. ఒక్కో ఎక్స్​ట్రా డివైజ్​కు 2 నుంచి 3 డాలర్ల చొప్పున వసూలు చేసే అవకాశముందని తెలుస్తోంది.

నెట్​ఫ్లిక్స్​తో పాటు అమెజాన్ ప్రైమ్​, డిస్నీ ప్లస్​ హాట్​స్టార్ వంటి ఓటీటీ ప్లాట్​ఫామ్స్​ కూడా పరిమిత సంఖ్యలో డివైజ్​లలో లాగిన్​కు వీలు కల్పిస్తున్నాయి. అయితే  కొన్నింటిలో ఒక సారి ఒక డివైజ్​లో మాత్రమే స్ట్రీమింగ్ చేసే వీలున్న విషయం తెలిసిందే. వాటన్నింటిలో నెట్​ఫ్లిక్స్​ చాలా ప్రీమియం కావడం గమనార్హం.

Also read: Petrol price Today: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు- హైదరాబాద్​, వైజాగ్​లలో ప్రస్తుత రేట్లు ఇలా..

Also read: Edible Oil Price: వంట నూనెల ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News