Gas Prices Hike: పండుగ సీజన్‌లో సామాన్యుడికి భారీ షాక్ తగలనుంది. నేచురల్ గ్యాస్ ధర భారీగా పెరగనుందని తెలుస్తోంది. ఫలితంగా సీఎన్జీ, పీఎన్జీ గ్యాస్ మరింత ప్రియం కావచ్చు. ఏకంగా 40 శాతం పెరిగిపోయింది.
ఓ వైపు దసరా మరోవైపు దీపావళి. అంతా పండుగ సీజన్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో సామాన్యుడికి భారీగా షాక్ తగలనుంది. నేచురల్ గ్యాస్ ధర 40 శాతం పెరిగి రికార్డు స్థాయికి చేరుకుంది. ఫలితంగా రేపు అంటే అక్టోబర్ 1 న జరిగే సమీక్షలో ఎల్బీజీ గ్యాస్ ధర కూడా పెరగవచ్చని అంచనా. అంతేకాకుండా సీఎన్జీ, పీఎన్జీ ధరలు మరింత ప్రియం కానున్నాయి.
సీఎన్జీ-పీఎన్జీ ధరల్లో పెరుగుదల
నేచురల్ గ్యాస్ ధర 40 శాతం పెరగడంతో అక్టోబర్ నెల నుంచి వంట గ్యాస్ ధర కూడా పెరిగే అవకాశాలున్నాయి. అక్టోబర్ 1 న జరిగే ధరల సమీక్షలో నేచురల్ గ్యాస్ ధర పెరగవచ్చు. ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ధరలు నిర్ణయిస్తుంది. ఈ సమీక్ష ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1, అక్టోబర్ 1న జరుగుతుంటుంది. ఇప్పుడు నేచురల్ గ్యాస్ ధర పెరగనుండటంతో సీఎన్జీ, పీఎన్జీ ధరలు పెరగనున్నాయి.
క్రూడ్ ఆయిల్ ధరల్లో పెరుగుదల
మరోవైపు ఇవాళ క్రూడ్ ఆయిల్ ధరలు వేగంగా పెరిగాయి. క్రూడ్ ఆయిల్ ధర 27 రూపాయలు పెరిగి బ్యారెల్‌కు 6,727 రూపాయలైంది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో క్రూడ్ ఆయిల్ అక్టోబర్ నెల డెలివరీ ధరల్లో పెరుగుదల నమోదైంది. అక్టోబర్ నెలలో డెలివరీ ధర 27 రూపాయలు లేదగా 0.4 శాతం పెరిగి..6,727 రూపాయలైంది. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడానికి వివిధ కారణాలున్నాయి.
Also read: Air India Flights: లండన్, బర్మింగ్‌హోమ్, శాన్‌ఫ్రాన్సిస్కోలకు అదనంగా 20 విమానాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook