MG George Muthoot passes away: ముథూట్ గ్రూప్ చైర్మన్ ఎం.జి. జార్జ్ ముథూట్ ఇక లేరు. నాన్-బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ (NBFC) రంగంలో అతి పెద్ద Gold loan కంపెనీగా పేరు తెచ్చుకున్న ముథూట్ ఫినాన్స్ కంపెనీని ముందుండి నడిపించిన ఎం.జి. జార్జ్ ముథూట్ శుక్రవారం రాత్రి ఢిల్లీలో కన్నుమూసినట్టు ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించింది. ప్రస్తుతం ఆయన వయస్సు 72 ఏళ్లు. ముథూట్ కుటుంబంలో Muthoot Group Chairman గా బాధ్యతలు స్వీకరించిన మూడో తరం వ్యక్తి ఆయన.
Muthoot Group ని ఓవైపు విజయవంతంగా నడిపిస్తూనే మరోవైపు FICCI కి నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గానూ సేవలు అందించారు. అంతేకాకుండా FICCI Kerala State Council కి ఎంజి జార్జ్ ముథూట్ చైర్మన్‌గానూ ఉన్నారు. గతేడాది Forbes Magazine ప్రకటించిన శ్రీమంతుల జాబితాలో చోటు దక్కించుకున్న ఆరుగురు మళయాళీలలో జార్జ్ ముథూట్ కూడా ఒకరు. ఇప్పటివరకు ఆయన Indian Orthodox Church ట్రస్టీగానూ కొనసాగుతూ వచ్చారు.
Also read : Home Loan Interest Rate: సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకుందా, మీకు ICICI Bank శుభవార్త అందించింది
దేశంలో Gold loans అంటేనే ముథూట్ ఫినాన్స్.. Muthoot Finance అంటేనే గోల్డ్ లోన్స్ అనే స్థాయికి ఆ సంస్థను తీసుకురావడంలో MG George Muthoot కృషి ఎంతగానో ఉంటుందంటుంటారు ఆయన గురించి బాగా తెలిసిన బిజినెస్ ఎక్స్‌పర్ట్స్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook