Maruti Ispat and Pipes: రూ.2 వేల కోట్ల పెట్టుబడి లక్ష్యం.. MS వాయు పేరిట వినూత్న ఉత్పత్తులు

Business News in Telugu: ఎంఎస్ వాయు అనే కొత్త బ్రాండ్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది మారుతీ ఇస్పాత్ & పైప్స్. వచ్చే ఐదేళ్లలో రూ.రెండు వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 26, 2024, 03:20 PM IST
Maruti Ispat and Pipes: రూ.2 వేల కోట్ల పెట్టుబడి లక్ష్యం.. MS వాయు పేరిట వినూత్న ఉత్పత్తులు

Business News in Telugu: హైదరాబాద్‌కు చెందిన మారుతీ ఇస్పాత్ & పైప్స్ (MIPPL) MS VAYU అనే కొత్త బ్రాండ్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. రానున్న ఐదేళ్లలో 6 లక్షల మెట్రిక్ టన్నుల (mtpa) సామర్థ్యాలను విస్తరించడానికి రూ.2 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో సరికొత్త బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. దక్షిణాధి రాష్ట్రాలతోపాటు, మధ్య, పశ్చిమ రాష్ట్రాలకు విస్తరించే దిశగా కొత్త బ్రాండ్‌తో వ్యాపారాన్ని ప్రారంభించింది. మార్కెట్లో తb స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ దేశంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాలకు వేగంగా విస్తరించేందుకు కొత్త ప్రాంతాల్లోనూ ఉత్పత్తి సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్ల కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 2026 నాటికి ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO)ని నిర్వహించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. నాణ్యమైన పైపులు, స్పాంజ్ ఐరన్, ERW స్టీల్ పైపులు, బిల్లెట్‌లను ఉత్పత్తి చేయడానికి తాము సిద్దంగా ఉన్నట్లు చెప్పారు.

Also Read: Prabhas Recent Movies Pre Release Business: టాలీవుడ్ లోనే  కాదు మన దేశంలో ఆ రికార్డు ఒక్క ప్రభాస్ కు మాత్రమే సాధ్యమైంది..     

ప్రస్తుతం ఏపీలోని కర్నూల్ జిల్లా మంత్రాలయంలో ఉన్న 300 ఎకరాల ప్లాంట్ నుంచి మారుతీ ఇస్పాత్ ప్రస్తుతం 8 MW -WHRB పవర్‌ను ఉత్పత్తి చేస్తోంది. అదేవిధంగా విండ్, సోలార్ పవర్ వంటి గ్రీన్, పునరుత్పాదక వనరుల నుంచి 90 శాతానికిపైగా పవర్‌ను ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది. వ్యర్థాల తగ్గింపు కోసం ప్రత్యామ్నాయ ఇంధనాలను వినియోగించి ఉత్పత్తిని పెంచాలని చూస్తోంది. సీఈఓ అభిషేక్ అగర్వాల్ మాట్లాుతూ.. ఉక్కు పరిశ్రమలో తమ స్థానాన్ని బలోపేతం చేసుకునేలా వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. అదేవిధంగా వినియోగదారులకు అధిక-నాణ్యత ఉత్పత్తులను అందించడం ద్వారా మార్కెట్‌లో తమ ఉనికిని పెంచుకోవడమే లక్ష్యమని వివరించారు. 

ఐపీఓ ద్వారా J&K, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి తూర్పు రాష్ట్రాల్లో విస్తరించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుతం ERW స్టీల్ పైప్‌లను ఉత్పత్తి చేస్తున్నామని స్పష్టం చేశారు. MS వాయు పేరిట గాల్వనైజ్డ్ పైపులు, గాల్వనైజ్డ్ హాట్ డిప్ ఐరన్, గాల్వా వాల్యూమ్ పైపులు వంటి కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తామని తెలిపారు. ఈ కొత్త ఉత్పత్తులు మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చగలుగుతామన్నారు. వాణిజ్య వృద్ధి, ఆవిష్కరణల ద్వారా తమ సంస్థ స్టీల్, పవర్‌లో వైవిధ్యతతో కూడిన ఆధునిక ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను నిర్మించేలా దృష్టి సారించామన్నారు.

మంత్రాలయం ప్లాంట్‌లో 1,500కుపైగా ఉద్యోగులు, వివిధ కార్యాలయాల్లో 500+ సిబ్బందితో, కంపెనీ సహాయక, సమగ్రమైన పని వాతావరణాన్ని కలిగిన ఏకైక కంపెనీగా ఉన్నామన్నారు. 2026 నాటికి ఐపీవో లక్ష్యంతో ప్రస్తుతం ఉన్న మారుతీ ఇస్పాత్ & పైప్స్‌ను బ్రాండ్ నేమ్‌ను సుస్థిరం చేసుకునేలా పబ్లిక్ ఆఫర్ అండ్ అక్విజిషన్ స్ట్రాటజీని ప్లాన్ చేస్తోందన్నారు. అదేవిధంగా విస్తరణతో ఉత్తరాది రాష్ట్రాలైన జమ్మూకశ్మీర్, పంజాబ్, ఉత్తరాఖండ్, అలాగే తూర్పులోని పశ్చిమబెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లోనూ గణనీయమైన ఉద్యోగ అవకాశాల కల్పన, స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. 

Also Read: Heavy Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News