Baleno Second Hand Cars: 4.5 లక్షలకే మారుతీ సుజుకి బాలెనో.. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే!

Second Hand Maruti Suzuki Baleno Cars available Rs 5 Lakhs at Cars 24. మారుతి బాలెనో పాత వెర్షన్‌ సెకండ్ హ్యాండ్ కార్లు మార్కెట్‌లో చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 17, 2023, 07:38 PM IST
  • 4.5 లక్షలకే మారుతీ సుజుకి బాలెనో
  • ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే
  • 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌, మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌
Baleno Second Hand Cars: 4.5 లక్షలకే మారుతీ సుజుకి బాలెనో.. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే!

Buy Second Hand Maruti Suzuki Baleno Cars under Rs 5 Lakhs in Cars 24: గత కొన్ని నెలలుగా భారత మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో 'మారుతీ సుజుకి బాలెనో' ఒకటి. మారుతీ కంపెనీకి చెందిన  ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు బాలెనో. 2022లో ఈ కారు యొక్క కొత్త మోడల్ కూడా వచ్చింది. అయితే బాలెనో పాత మోడల్ కూడా ఏ విషయంలోనూ కొత్త మోడల్‌కు తక్కువ కాదు. మీరు మారుతి బాలెనో పాత వెర్షన్‌ను ఇష్టపడితే.. సెకండ్ హ్యాండ్ కార్లు మార్కెట్‌లో చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. కార్స్ 24 (Cars 24) వెబ్‌సైట్‌లో సెకండ్ హ్యాండ్ కార్లు చాలానే ఉన్నాయి. వాటి ధర రూ.4.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉంది.

2015 Maruti Baleno ALPHA:
కార్స్ 24 వెబ్‌సైట్‌లో 2015 మారుతీ బాలెనో ఆల్ఫా కార్ ధర రూ. 4,60,000 లుగా ఉంది . ఈ కారు 80,238 కిలోమీటర్లు నడిచింది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ని కూడా కలిగి ఉంది.

2016 Maruti Baleno DELTA:
2016 మారుతి బాలెనో డెల్టా కారు ధర రూ. 4,96,000 లుగా ఉంది. ఈ కారు రీడింగ్ 80,834 కిలోమీటర్లుగా ఉంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. అలానే మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ని కలిగి ఉంది.

2017 Maruti Baleno DELTA:
కార్స్ 24 వెబ్‌సైట్‌లో 2017 మారుతి బాలెనో డెల్టా కారు ధర రూ. 4,82,000. ఈ కారు 79,157 కిలోమీటర్లు నడిచింది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ని కలిగి ఉంది.

2016 Maruti Baleno ALPHA:
2016 మారుతి బాలెనో ఆల్ఫా ధర రూ. 4,99,000లుగా కార్స్ 24 వెబ్‌సైట్‌లో ఉంది. ఈ కారు రీడింగ్ 53,429 కిలోమీటర్లుగా ఉంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ కూడా ఇందులో అందుబాటుల ఉంది.

Also Read: Hyundai Micro SUV: హ్యుందాయ్ నుంచి చౌకైన ఎస్‌యూవీ.. టాటా పంచ్‌కి ఇక చుక్కలే!

Also Read: Saturn Transit 2023 Effect: ఈ రాశులపై శని మహాదశ ప్రారంభం.. ఈ పరిహారాలు మిమ్మల్ని విముక్తుల్ని చేస్తాయి!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News