మహీంద్రా కంపెనీ త్వరలోనే మహీంద్రా థార్ ఎస్‌యూవీ 5 డోర్ వెర్షన్ లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ కారు ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్, సీటింగ్ లే అవుట్ వివరాలు వెల్లడి కాగా ఇప్పుడు తాజాగా ఇంజన్ ఫీచర్లు తెలిశాయి..
మహీంద్రా థార్ 5 డోర్ కారును రోడ్ టెస్టింగ్ సందర్భంగా చూసే ఉంటారు. అద్భుతమైన డిజైన్‌తో సీటింగ్ లే అవుట్‌తో అందర్నీ ఆకట్టుకోవచ్చనే అంచనా ఉంది. ఇప్పుడీ కారు ఇంజన్ వివరాలు వెల్లడయ్యాయి. ధార్ కారు త్రీ డోర్ వెర్షన్‌లానే కంపెనీ ఇందులో కూడా 4/4, 4/2 సెటప్ ఉంటుంది.
పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్
ఆటోకార్ ఇండియా రిపోర్ట్ ప్రకారం మహీంద్రా ప్రవేశపెడుతున్న ఈ ఎస్‌యూవీలో పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. అందుబాటులో ఉన్న థార్ కారులానే ఇందులో 2.2 లీటర్ డీజిల్, 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ ఉంది. ఈ మధ్యన లీకైన ఫోటో ప్రకారం..ఈ కారులో 4/4 లివర్ లేదు. దాంతో 4/2 సెటప్ ఉండవచ్చని తెలుస్తోంది.
ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ ఇలా
ఎక్స్‌టీరియర్ గురించి పరిశీలిస్తే..ప్రస్తుతం అందుబాటులో ఉన్న థార్ కారుతో పోలిస్తే 300 మిల్లీమీటర్లు పొడుగు ఉంటుంది. ఇందులో పూర్తిగా కొత్త బాడీ ప్యానెల్ ఉంది. ఇంటీరియర్‌లో ఓవరాల్ డిజైన్ ఇప్పుడున్న థార్‌లానే ఉంటుంది. ఇందులో మెరుగైన ఇన్‌ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రిస్ట్, సన్ గ్లాస్ హోల్డర్ వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి.
మహీంద్రా థార్ 5 డోర్ రెండవ వరుసలో పొడవైన వీల్ బేస్ వల్ల ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. కానీ మహీంద్రా 3 సీటర్ బెంచ్ లే అవుట్ ఆఫర్ చేస్తుందా లేదా అనేది ఇంకా తెలియదు. ఈ కారు బూట్ స్పేస్ కూడా కచ్చితంగా 3 డోర్ వెర్షన్‌తో పోలిస్తే విశాలంగానే ఉండవచ్చు.
Also read: Adani Companies: అదానీకు మరో షాక్, ఆ మూడు కంపెనీలపై ఇక ఏఎస్ఎం ఫ్రేమ్‌వర్క్ నిఘా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook