Mahindra Sales: భారతీయ కార్ మార్కెట్ చాలా పెద్దది. ప్రముఖ కంపెనీలన్నీ వివిధ రకాల కార్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటాయి. మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుండయ్, మహీంద్రా కంపెనీ కార్లు మేజర్ వాటా కలిగి ఉంటాయి. దేశంలో ప్రస్తుతం ఎస్‌యూవీ ట్రెండ్ నడుస్తోంది.
దేశంలో ఇటీవల ఎస్‌యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతుండటంతో మహీంద్రా, టాటా, హ్యుండయ్ కంపెనీ కార్లు ఒకదానికొకటి పోటీపడుతున్నాయి. జూలై నెల విక్రయాల్లో మహీంద్రా కంపెనీ అద్బుతమైన వృద్ధి నమోదు చేసింది. మహీంద్రాకు చెందిన ఎస్‌యూవీ కారు జూలైలో అత్యధికంగా విక్రయాలు నమోదు చేసింది. మహీంద్రా స్కార్పియో, ఎక్స్‌యూవీ 700 వాహనాలు రికార్డు స్థాయిలో అమ్మకాలు సాధించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ జూలై నెల విక్రయాలను విడుదల చేసింది. ఇందులో స్వదేశీ మార్కెట్‌లో మహీంద్రా కంపెనీ వాహనాల విక్రయాలు 29 శాతం పెరిగి 36,205 యూనిట్ల అమ్మకాలు సాధించింది. 2023 జూలైలో 28,053 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది.
మహీంద్రా కంపెనీకు ఇది రికార్డు స్థాయి అమ్మకాలు. ఒక నెలలో 36,205 ఎస్‌యూవీ యూనిట్లు అమ్మకాలు జరిగాయి. 20 నెలల రికార్డు సమయంలో ఎస్‌యూవీ 700 కొనుగోలుదారుల సంఖ్య లక్షకు చేరుకుంది. దాంతోపాటు జూలై నెలలో స్కార్పియో అత్యధిక విక్రయాలు జరిపింది.
టాటా మోటార్స్ మొత్తం విక్రయాలు జూలైలో ఒక శాతం తగ్గి 80,633 యూనిట్లు ఉంది. జూలై 2022లో 81,790 వాహనాలు విక్రయాలు నమోదు చేసింది. టాటా మోటార్స్ కంపెనీకు చెందిన స్వదేశీ విక్రయాలు జూలై నెలలో సాధారణ తగ్గుదలతో పాటు 78,844 యూనిట్లు విక్రయాలు జరిగాయి. జూలై 2022లో 78,978 యూనిట్ల విక్రయాలు జరిగాయి.
మరోవైపు మహీంద్రా కంపెనీ వాణిజ్య వాహనాల విక్రయాలు 4 శాతతం తగ్గి 32,944 యూనిట్లకు చేరుకుంది. 2022 జూలైలో 34,154 యూనిట్లు ఉంది. టాటా మోటార్స్ స్వదేశీ మార్కెట్ విక్రయాలు 47.628 యూనిట్లుగా ఉంది.
Also read: Redmi 12 5G Phone: తక్కువ ధరలో వస్తోన్న 256GB వేరియంట్ ఫోన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook