LPG Gas Cylinder Insurance: సిలిండర్ వాడుతున్నారా..? ఒక్క రూపాయి చెల్లించకుండానే రూ.50 లక్షల బీమా.. ఎలాగంటే..?

LPG Consumer Protection: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు అనుకోకుండా పేలితే.. కేంద్ర ప్రభుత్వం బీమా కల్పిస్తోంది. రూ.50 లక్షల వరకు కుటుంబానికి మొత్తం ఇన్సూరెన్స్ చేస్తోంది. ఇందుకోసం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2024, 05:10 PM IST
LPG Gas Cylinder Insurance: సిలిండర్ వాడుతున్నారా..? ఒక్క రూపాయి చెల్లించకుండానే రూ.50 లక్షల బీమా.. ఎలాగంటే..?

LPG Consumer Protection: ప్రస్తుతం చాలా మంది కట్టెల పొయ్యికి టాటా చెప్పేసి.. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నారు. గతంతో పోలిస్తే.. గ్యాస్ వినియోగం భారీస్థాయిలో పెరిగిన విషయం తెలిసిందే. గ్యాస్ సిలండర్‌తో వంట ప్రజయోనాలే కాకుండా.. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.50 లక్షల బీమా ప్రయోజనం కూడా ఉంటుంది. గ్యాస్ సిలిండర్ బుక్ చేయగానే.. ఆ కుటుంబానికి ఈ బీమా కవరేజీ మొత్తం లభిస్తుంది. ఈ బీమా కోసం వినియోగదారులు ఎలాంటి డబ్బులు కూడా చెల్లించాల్సిన పనిలేదు.

ఇళ్లలో సిలిండర్లు పేలుతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చమురు కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం బీమా అందజేస్తుంది. అనుకోని ఘటనలు జరిగినప్పుడు ఈ బీమాతో ఆ కుటుంబాలకు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. ఏ ఎల్‌పీజీ వినియోగదారుడు అయినా తన కుటుంబం కోసం పెట్రోలియం కంపెనీల నుంచి రూ.50 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు.

బీమా నిబంధనలు ఇవే..

==>> అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు ఒక్కో సభ్యుడికి ప్రభుత్వం రూ.10 లక్షలు అందజేస్తుంది. 
==>> మొత్తం కుటుంబానికి గరిష్టంగా రూ.50 లక్షల వరకు లిమిట్ ఉంటుంది. 
==>> ప్రమాదంలో కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగితే.. రూ.2 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు.
==>> ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే.. వ్యక్తిగత ప్రమాద కవర్ కింద రూ.6 లక్షలు లభిస్తుంది. 
==>> చికిత్స కోసం అయితే.. ఒక్కో సభ్యుడికి రూ.2 లక్షలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం కుటుంబానికి గరిష్టంగా రూ.30 లక్షల వరకు లిమిట్ ఉంటుంది. 

సిలిండర్ తీసుకునేముందు కచ్చితంగా గడువు తేదీని చెక్ చేసుకోవాలి. సిలిండర్ పైభాగంలో మూడు వెడల్పు స్ట్రిప్స్‌పై కోడ్ రూపంలో ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఈ కోడ్ A-24, B-25, C-26 లేదా D-27గా ఉంటుంది.ఈ కోడ్‌లో ABCD అంటే.. A అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, B అంటే ఏప్రిల్, మే, జూన్, C అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, D అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. మొత్తం 12 నెలలు నాలుగు సెట్స్‌గా ఉంటాయి. A-24 అంటే.. 2024 సంవత్సరంలో జనవరి నుంచి మార్చి  ఆ సిలిండర్ గడువు ముగుస్తుందని అర్థం.

Also Read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

Also Read:  Washing Machine Offers: ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.3,990కే రియల్‌ మీ 8.5 Kg Top Load వాషింగ్‌ మెషిన్‌..   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News