Netflix Subscription Free with JIO Recharge: సరికొత్త ఆఫర్లతో జియో ఎప్పటికప్పుడు తమ వినియోగదారులకు ఆకట్టుకుంటోంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లను ఫ్రీగా చూసే విధంగా లేటెస్ట్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. మీరు కొత్త కొత్త సినిమాలను చూసేందుకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. ఇందుకోసం జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ని తీసుకువచ్చింది. మీరు చాలా ఇష్టపడే అన్ని ఫీచర్లు ఈ ప్లాన్ ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా..
జియో పోస్ట్ పెయిడ్ వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్‌లో కంటెంట్ ఫ్రీగా చూడాలనుకుంటే.. 699 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో ఉచిత ఓటీటీ ప్రయోజనాలు మాత్రమే కాకుండా.. అనేక ఇతర ప్రయోజనాలను కల్పిస్తోంది జియో. ముందుగా ఈ ప్లాన్‌లో మన దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా 100 జీబీ డేటాను కూడా వినియోగదారులు పొందుతారు. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో కస్టమర్‌లకు 3 సిమ్‌లు కూడా అందుకుంటారు. వీటిని మీ కుటుంబ సభ్యులతో పంచుకోని ఫ్రీగా మాట్లాడుకోవచ్చు.
ఈ ప్రయోజనాల కంటే రెండు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను ఉచితంగా అందివ్వడం ఈ ప్లాన్ స్పెషాలిటీ. ఈ చౌకైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను పూర్తిగా ఉచితంగా పొందొచ్చు. మీరు ప్రస్తుతం ప్రీపెయిడ్ కస్టమర్లు అయితే.. ఈ ప్లాన్ పొందాలంటే పోస్ట్ పెయిడ్‌లోకి మారాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వినియోగదారుల అవసరాలకు సరిపోయే అనేక ప్రయోజనాలను ఈ ప్లాన్ ద్వారా జియో అందిస్తోంది.
ఇది పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కావడంతో వ్యాలిడిటీ ముగిసినా.. సేవలు నిలిచిపోవు. అదే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో అయితే.. మీరు రీఛార్జ్ చేసిన ప్లాన్ గడువు ముగియగానే.. మీకు సేవలు ఆటోమెటిక్‌గా నిలిచిపోతాయి. రీఛార్జ్ చేసుకోలేని పరిస్థితుల్లో మీరు ఇబ్బంది పడాల్సి రావొచ్చు. ఇలాంటి ఇబ్బంది లేకుండా పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకుంటే.. మీకు అనేక ప్రయోజనాలు ఉంటాయి.
Also Read: PM Kisan Latest Updates: పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలర్ట్.. ఈ మూడు పనులు కచ్చితంగా చేయండి
Also Read: Best Breakfast Foods: మీ శరీరంలో ఇమ్యూనిటీని వేగంగా పెంచే 6 అద్భుతమైన బ్రేక్‌ఫాస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook