Income Tax Return Filing: ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువు మరికొన్ని రోజులే మిగిలి ఉంది. ఈ నెల 31వ తేదీలోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ శాలరీ నుంచి ఆదాయపు పన్నుగా మినహాయించిన మొత్తం ఎక్కువ అయితే.. మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి రిటర్న్ పొందుతారు. మీరు ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంటే.. సంపాదిస్తున్న ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. అయితే ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని. గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేసి.. పెనాల్టీకి దూరంగా ఉండండి. గతేడాది కంటే ఈసారి ఐటీఆర్‌లు ఎక్కువగా నమోదైనట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడిస్తున్నాయి.
ముందుగా మీరు ఏ పన్ను విధానంలో ఐటీఆర్ఎ ఫైల్ చేస్తున్నారో ఎంచుకోవాలి. పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానంలో ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌ను ఫైల్ చేయాలనుకుంటున్న రెజియన్‌ను ఎంచుకోవాలి. అందుకే మీరు సరైన పన్ను విధానాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. దాని ఆధారంగానే రిటర్న్స్ ఆధారపడి ఉంటుంది.
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను ఫైల్ చేసిన 30 రోజులలోపు వెరిఫికేషన్ చేసుకోవాలి. మీ రిటర్న్స్ వెరిఫై చేయకపోతే.. అది చెల్లనిదిగా పరిగణిస్తారు. అలాగే.. టైమ్ పిరియడ్ ముగిసిన తరువాత పన్ను చెల్లింపుదారు కొత్త ఐటీఆర్‌ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల మీ రిటర్న్స్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూసుకోవడానికి రిటర్న్స్ వైరీఫై చేసుకోవాలి.
కేంద్ర ప్రభుత్వ పథకాలు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడి పెడుతున్నా.. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తున్నా.. హోమ్ లోన్ చెల్లిస్తున్నా ట్యాక్స్ మినహాయింపుకు అర్హులు అవుతారు. ఎక్కువ రిటర్న్స్ క్లెయిమ్ చేయాలి. ఫారమ్ 16లో చూపినవి కాకుండా అన్ని మినహాయింపులు గుర్తించాలి. ఎలాంటి తప్పులేకుండా ఉండేందుకు ముందే డేటాను చెక్ చేసుకోండి.
మీరు బ్యాంక్ అకౌంట్‌ను వెరిఫై చేసుకోవాలి. ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఈ-పోర్టల్‌లో కరెక్ట్‌గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. వాపసును ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ తన పోర్టల్‌లోని యాక్టివ్‌లో ఉన్న బ్యాంక్ అకౌంట్‌కు మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్యాక్స్ రిటర్న్స్ పొందడానికి బ్యాంక్ ఖాతాను వైరిఫై చేసుకోండి.
Also Read: David Warner: డేవిడ్ వార్నర్ భార్య ఎమోషనల్ పోస్ట్.. చివరి మ్యాచ్ ఆడేశాడా..?
Also Read: YS Sharmila: ఊరు గొప్ప.. పేరు దిబ్బ.. దొర గారి డ్రీమ్డ్ ప్రాజెక్ట్ కాళేశ్వరం దుస్థితి: వైఎస్ షర్మిల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి