ఐఆర్‌సీటీసీ కేవలం దేశీయమైన టూర్ ప్యాకేజ్‌లే కాకుండా విదేశీ టూర్ ప్యాకేజ్‌లు కూడా నిర్వహిస్తోంది. దేశీయ టూర్ ప్యాకేజ్‌లలో దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన, అందమైన ప్రదేశాలున్నాయి. ఇందులో జమ్ము కశ్మీర్ పర్యటన ఒకటి.
ఇతర ప్రైవేట్ టూర్ ప్యాకేజ్‌లతో పోలిస్తే ఐఆర్‌సీటీసీ అత్యంత చౌకగా ఉండటమే కాకుండా..సౌకర్యాలు ఎక్కువ ఉంటాయి. దేశంలోని వివిధ ప్రాంతాలు చుట్టివచ్చే ప్యాకేజ్‌లు ఉన్నాయి. అందుకే చాలామంది ఈ ప్యాకేజ్‌లు ఇష్టపడుతుంటారు. కొత్త ఏడాదిలో భూతల స్వర్గంగా పిలిచే జమ్ము కశ్మీర్ పర్యటించాలనుకుంటే..అక్కడి మంచు వర్షం అనుభూతి పొందాలనుకుంటే ఇదే మంచి అవకాశం. ఐఆర్‌సీటీసీ అత్యంత చౌకైన ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజ్ తీసుకొచ్చింది. దీని ద్వారా కశ్మీర్‌లో 6 రోజులు గడపవచ్చు.
ఐఆర్‌సీసీటీ టూర్ ప్యాకేజ్‌లో శ్రీనగర్, గుల్‌మర్గ్, సోన్‌మర్గ్, పహల్‌గామ్ తిరిగి రావచ్చు. ఈ టూర్ ప్యాకేజ్‌లో ప్రయాణీకులు ఫ్లైట్ ద్వారా జర్నీ చేస్తారు. విశాఖపట్నం నుంచి ఈ టూర్ ప్రారంభమౌతుంది. టూర్ ప్యాకేజ్‌లో ప్రయాణీకులకు స్టే, భోజన ఏర్పాట్లు ఉంటాయి. ఈ టూర్ ప్యాకేజ్ 5 రాత్రులు, 6 రోజులుంటుంది. ఈ టూర్ ప్యాకేజ్ పేరు Kashmir-Heaven On Earth Ex Vishakhapatnam.
ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజ్ కొత్త ఏడాది 2023లో ఫిబ్రవరి 24, మార్చ్ 10, మార్చ్ 24న ప్రారంభమౌతుంది. ఇందులో బ్రేక్‌ఫాస్ట్ , డిన్నర్ ఉంటాయి. కంఫర్ట్ క్లాస్‌లో యాత్ర ఉంటుంది. మార్చ్ 24న ప్రారంభమయ్యే టూర్ ప్యాకేజ్ కంఫర్ట్ క్లాస్‌లో ట్రిపుల్ ఆక్సుపెన్సీలో ఒక్కొక్కరికి 39,120 రూపాయలవుతుంది. డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరి ఖర్చు 40,099 రూపాయలుంటుంది. అదే సింగిల్ ఆక్సుపెన్సీలో ఒక్కొక్కరి ఖర్చు 49,499 రూపాయలుంటుంది. 5-11 ఏళ్ల పిల్లలకు బెడ్తో పాటు 36,250 రూపాయలు ఛార్జ్ చేస్తారు. బెడ్ లేకుండా 33, 965 రూపాయలుంటుంది. ఫిబ్రవరిలో అయితే కశ్మీర్ మంచువర్షం కూడా చూడవచ్చు. ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook