IRCTC Ticket Cancellation Charges: మనం ఎప్పుడైనా రైల్వే టికెట్‌ను క్యాన్సిల్ చేస్తే.. టికెట్ మొత్తం కొంత డబ్బును మిహాయించుకుని ఇండియన్ రైల్వే కొంత రిఫండ్ చేస్తుంది. ఈ ఛార్జీలు సమయాన్ని బట్టి, బుక్ చేసుకున్న టికెట్ క్లాస్‌ను బట్టి ఉంటాయి. రైలు బయలుదేరడానికి ఎంత సమయం ఉందో లెక్కవేసుకుని.. మన ఖాతాలోకి రిఫండ్ పంపిస్తారు.
రైలు బయలుదేరడానికి 48 గంటల ముందు ఏసీ ఫస్ట్/ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్రయాణికులకు ఫ్లాట్ క్యాన్సిలేషన్ ఫీజు రూ.240 ఉంది. ఏసీ 2 టైర్/ఫస్ట్ క్లాస్ కోసం రూ.200, ఏసీ 3 టైర్/ఏసీ చైర్ కార్, ఏసీ 3 ఎకానమీకి 180 రూపాయలు ఛార్జీ వసూలు చేస్తున్నారు. సెకెండ్ క్లాస్‌కు రూ.60 రుసుము కట్ అవుతుంది.
ట్రైన్ బయలుదేరేందుకు 48 గంటల కంటే తక్కువ, రైలు బయలుదేరడానికి 12 గంటల ముందు కన్ఫార్మ్ అయిన టిక్కెట్‌ను రద్దు చేస్తే.. టికెట్ మొత్తంలో ఫీజు 25 శాతం ఉంటుంది. కనీస ఫ్లాట్ రద్దు ఛార్జీలకు లోబడి ఉంటుంది. అదే 12 గంటల కంటే తక్కువ నుంచి రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు రద్దు చేస్తే.. మొత్తం ఛార్జీలో 50 శాతం వసూలు చేస్తారు. కానీ ప్రతి తరగతికి కనీస ఫ్లాట్ క్యాన్సిలేషన్ ఛార్జీకి లోబడి ఉంటుంది.
ఆర్‌ఏసీ/వెయిట్‌లిస్ట్ చేసిన టిక్కెట్‌ల రద్దు కోసం రైలు నిర్ణీత నిష్క్రమణకు అరగంట ముందు (దూరంతో సంబంధం లేకుండా) టిక్కెట్ ఛార్జీలో క్లరికల్ ఛార్జీలను తీసివేసిన మొత్తం డబ్బులు రీఫండ్ చేస్తారు. 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో ప్రయాణికుల విభాగంలో దాని అంచనా ఆదాయాలు రూ.48,913 కోట్లకు పెరగడం విశేషం. ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 31, 2022 వరకు రిజర్వ్ ప్యాసింజర్ సెగ్మెంట్‌లో బుక్ చేసిన మొత్తం ప్రయాణికుల సంఖ్య 59.61 కోట్లుగా ఉంది. గతేడాది కంటే ఆరు శాతం పెరిగింది.
1 ఏప్రిల్ నుంచి 31 డిసెంబర్ వరకు అన్‌రిజర్వ్‌డ్ ప్యాసింజర్ కేటగిరీలో బుక్ చేసుకున్న మొత్తం ప్రయాణికుల సంఖ్య 40,197 లక్షలు. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో 16,968 లక్షల కంటే 137 శాతం ఎక్కువ అని రైల్వే అధికారులు చెబుతున్నారు.
Also Read: Tax Saving Schemes 2023: ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి.. ఆదాయంతోపాటు సూపర్ బెనిఫిట్స్
Also Read: Shubman Gill: ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన.. చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి