iQOO Neo9 Pro 5G Price Drop: వావ్‌ ఏం డిస్కౌంట్‌.. రాఖీ వేళ అమెజాన్‌లో Iqoo Neo9 Pro 5G మొబైల్‌పై రూ.33,000 తగ్గింపు!

iQOO Neo9 Pro 5G Price Drop: అత్యధిక తగ్గింపుతో iQOO Neo9 Pro 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది మంచి అవకాశం గా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ తో కూడిన ఈ మొబైల్ అమెజాన్ లిమిటెడ్ టైం డీల్ లో భాగంగా అది తక్కువ ధరకే లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 19, 2024, 12:39 PM IST
iQOO Neo9 Pro 5G Price Drop: వావ్‌ ఏం డిస్కౌంట్‌.. రాఖీ వేళ అమెజాన్‌లో Iqoo Neo9 Pro 5G మొబైల్‌పై రూ.33,000 తగ్గింపు!

iQOO Neo9 Pro 5G Price Drop: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ లో రాఖీ పండగ సందర్భంగా లిమిటెడ్ టైం డీల్ ప్రారంభమైంది ఇందులో భాగంగా కొన్ని రకాల వస్తువులపై ముఖ్యంగా స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ ను అందిస్తోంది అంతేకాకుండా వాటర్ ప్యూరిఫైయర్ మిక్సీ గ్రైండర్స్ రిఫ్రిజిరేటర్స్ ఏసీలపై ఎప్పుడు అందించలేని ఆఫర్స్ ను కూడా ఈరోజు అమెజాన్ అందిస్తోంది. ముఖ్యంగా ఈ సమయంలో స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేయాలనుకునే వారికి అద్భుతమైన అవకాశం గా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ తో కూడిన కొన్ని రకాల స్మార్ట్ ఫోన్స్ అతి తక్కువ ధరల్లోనే అందుబాటులో ఉన్నాయి. అలాగే అదనంగా వీటిపై ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్స్ తో పాటు ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. 

అమెజాన్లో ప్రత్యేకమైన లిమిటెడ్ టైం డీల్ లో భాగంగా iQOO Neo9 Pro 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది అంతేకాకుండా రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ మొబైల్ ను కంపెనీ మార్కెట్లో ధర రూ.39,999లకు విడుదల చేసింది. అయితే అమెజాన్ అందిస్తున్న లిమిటెడ్ టైం డీల్ లో భాగంగా కొనుగోలు చేసే వారికి ఇది 13 శాతం తగ్గింపుతో కేవలం రూ.34,999కే పొందవచ్చు.

అంతేకాకుండా అదనంగా తగ్గింపు పొందడానికి అమెజాన్ మరిన్ని డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. వీటిల్లో బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ ను వినియోగించి కొనుగోలు చేసే వారికి భారీ తగ్గింపు లభించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్, వన్ కార్డ్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా రూ.2,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా దీనిపై అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తుంది. దీనిని వినియోగించాలనుకునేవారు ముందుగా పాత స్మార్ట్ ఫోన్ ని ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ. 33,000 వరకు తగ్గింపు లభిస్తుంది.

iQOO Neo 9 Pro 5G టాప్ ఫీచర్లు..
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌తో 
డిస్ప్లే: 6.78 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌
ఆపరేటింగ్ సిస్టమ్: Android 14 
గేమింగ్ ఫీచర్లు: గేమింగ్ మోడ్‌లు, కూలింగ్ సిస్టమ్‌తో గేమింగ్ 
కెమెరా: 50MP ప్రైమరీ కెమెరా (IMX920 సెన్సార్) 8K వీడియో రికార్డింగ్ 
కనెక్టివిటీ: 5G సపోర్ట్ మరియు USB Type-C పోర్ట్
డిజైన్: శాట్ జెన్సేషన్ అప్ ప్రొటెక్షన్‌తో స్టైలిష్ డిజైన్
బ్యాటరీ: 5160 mAh బ్యాటరీ, 120W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్
రామ్ & స్టోరేజ్: 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News