Infinix Note 11 Flipkart: ఇన్ఫీనిక్స్ నోట్ 11 సేల్ మొదలైంది.. ఆఫర్ ధర రూ.11,999 మాత్రమే!

Infinix Note 11 Flipkart: ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ ఫ్లిప్ కార్ట్ లో మరో కొత్త వేరియంట్ మొబైల్ సేల్ కు వచ్చింది. హాంగ్ కాంగ్ కు చెందిన ఇన్ఫీనిక్స్ నోట్ 11, ఇన్ఫీనిక్స్ నోట్ 11 ఎస్ వేరియంట్స్ ను మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. కేవలం రూ.11,999 ధరకే అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్స్ వివరాలేంటో తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2021, 06:34 PM IST
Infinix Note 11 Flipkart: ఇన్ఫీనిక్స్ నోట్ 11 సేల్ మొదలైంది.. ఆఫర్ ధర రూ.11,999 మాత్రమే!

Infinix Note 11 Flipkart: స్మార్ట్ ఫోన్స్ కోసం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేకమైన సేల్ నడుస్తోంది. అయితే ఈ సేల్ ద్వారా ఇన్ఫీనిక్స్ నోట్ 11 కూడా అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దీని ధర రూ.12 వేల కంటే తక్కువ ఉండడం విశేషం. అయితే మార్కెట్లోకి కొత్తగా వచ్చిన స్మార్ట్ ఫోన్ తాలూకూ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకుందామా?

హాంగ్ కాంగ్ కు చెందిన ఈ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్ఫీనిక్స్ ఇప్పుడు ఇండియా మార్కెట్స్ లోనూ లభ్యమవుతోంది. ఇప్పుడు భారత విపణిలోకి ఇన్ఫీనిక్స్ నోట్ 11, ఇన్ఫీనిక్స్ నోట్ 11 ఎస్ మోడల్స్ లాంఛ్ చేస్తున్నారు. గతంలో రిలీజ్ చేసిన ఇన్ఫీనిక్స్ నోట్ 10 సిరీస్‌ను అప్‌గ్రేడ్ చేసి ఇన్ఫీనిక్స్ నోట్ 11, ఇన్ఫీనిక్స్ నోట్ 11ఎస్ వేరియంట్స్ గా ఆ సంస్థ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడా స్మార్ట్ ఫోన్లు ఫ్లిప్ కార్ట్ లో విక్రయిస్తున్నారు. 

ఫ్లిప్ కార్ట్ వేదికగా గురువారం నుంచి ఇన్ఫీనిక్స్ నోట్ 11 అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దీని ద్వారా ఇన్ఫీనిక్స్ నోట్ 11, ఇన్ఫీనిక్స్ నోట్ 11 ఎస్ వేరియంట్స్ ను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫీనిక్స్ నోట్ 11 స్మార్ట్ ఫోన్ ధర రూ.11,999గా ఉంది. 

ఇన్ఫీనిక్స్ నోట్ 11 స్మార్ట ఫోన్ వివరాలు.. 

1) స్టోరేజ్ - 4GB RAM + 64GB Storage
2) కలర్స్  - గ్రాఫైట్ బ్లాక్, సెలెస్టియల్ స్నో, గ్లేసియర్ గ్రీన్
3) డిస్ ప్లే - 6.7 అంగుళాల ఫుల్ HD+అములెట్ డిస్ ప్లే 
4) ప్రాసెసర్ - మీడియాటెక్ హీలియా జీ88 ప్రాసెసర్
5) గేమ్ బూస్ట్ టెక్నాలజీ - DAR-LINK 2.0 ఫీచర్ 
6) కెమెరా  - 50Mp (మెయిన్ కెమెరా) + 2Mp డెప్త్ సెన్సార్+ AI lens 
7) ఫ్రంట్ కెమెరా - 16 మెగా పిక్సల్స్
8) బ్యాటరీ  - 5000 mAh+ 33W Fast Charging
9) ఆపరేటింగ్ సిస్టమ్  -  ఆండ్రాయిడ్ 11 + ఇన్ఫీనిక్స్ XOS10 
10) డిస్ ప్లేలో ఐకేర్ మోడ్, గొరిల్లా గ్లాస్ 3 లేయర్ ప్రొటెక్షన్ కలదు. 

Also Read: RBI new rules: ఆన్​లైన్​ లావాదేవీలా? ఆర్​బీఐ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాల్సిందే!

Also Read: Go First Offering Discount: రెండు డోసుల వ్యాక్సిన్​ తీసుకుంటే విమాన ఛార్జీలపై 20 శాతం డిస్కౌంట్​!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News