Air taxis services: ఇకపై గాల్లోనూ ఎయిర్ టాక్సీలు బుక్ చేసుకోవచ్చు

India’s first Air Taxi service launched : న్యూ ఢిల్లీ: ఇప్పటివరకు ట్యాక్సీ అంటే ఓలా, ఉబర్ లాంటి సంస్థలకు చెందిన ఆటోలు లేదా క్యాబ్స్ గుర్తుకొచ్చేవి.. కానీ ఇకపై ట్యాక్సీ అంటే రోడ్డుపై మాత్రమే కాదు.. మీరు ఒక సిటీ నుండి మరొక సిటీకి గాలిలో ప్రయాణించే అవకాశం కూడా ఉంది. అవును.. ప్రస్తుతానికి కేంద్రం సహాయంతో హర్యానా ప్రభుత్వం తీసుకున్న చొరవతో ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి వచ్చాయి.

Last Updated : Jan 16, 2021, 07:17 AM IST
Air taxis services: ఇకపై గాల్లోనూ ఎయిర్ టాక్సీలు బుక్ చేసుకోవచ్చు

India’s first Air Taxi service launched : న్యూ ఢిల్లీ: ఇప్పటివరకు ట్యాక్సీ అంటే ఓలా, ఉబర్ లాంటి సంస్థలకు చెందిన ఆటోలు లేదా క్యాబ్స్ గుర్తుకొచ్చేవి.. కానీ ఇకపై ట్యాక్సీ అంటే రోడ్డుపై మాత్రమే కాదు.. మీరు ఒక సిటీ నుండి మరొక సిటీకి గాలిలో ప్రయాణించే అవకాశం కూడా ఉంది. అవును.. ప్రస్తుతానికి కేంద్రం సహాయంతో హర్యానా ప్రభుత్వం తీసుకున్న చొరవతో ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉడాన్ పథకం ( UDAN scheme ) కింద చండీఘడ్ నుండి హిసార్ వరకు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభించారు.

రెండవ దశలో హిసార్ నుండి డెహ్రాడూన్ వరకు విమాన సర్వీసులు కూడా ప్రారంభమవుతాయని, మూడవ దశలో మరో రెండు మార్గాలు చేర్చనున్నామని ఖట్టర్ తెలిపారు. ఎయిర్ ట్యాక్సీ సేవల గురించి మరిన్ని వివరాలను తెలియజేస్తూ, రెండవ దశలో హిసార్ నుండి డెహ్రాడూన్ వరకు జనవరి 18న సర్వీసులు ప్రారంభమవుతాయని చెప్పారు. మూడవ దశలో జనవరి 23 నుంచి చండీఘడ్ నుండి డెహ్రాడూన్, హిసార్ నుండి ధర్మశాల వరకు మరో రెండు మార్గాల్లో సేవలు ప్రారంభించనున్నట్టు హర్యానా సీఎం తెలిపారు. షిమ్లా, కులుతో పాటు హర్యానాలోని మరిన్ని పర్యాటక ప్రాంతాల్లో కూడా ఎయిర్ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.

టికెట్ ఛార్జీలు, సీటింగ్ సామర్థ్యం, వేగ పరిమితి ( Air taxis ticket booking prices, seating capacity, speed limit )
లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం ఈ ఎయిర్ టాక్సీలు నాలుగు సీట్ల సీటింగ్ కెపాసిటీతో, గంటకు 250 కిమీ స్పీడ్ కెపాసిటీ కలిగి ఉంటాయి. పైలట్‌తో పాటు, ముగ్గురు ప్రయాణీకులు ఈ ఎయిర్ టాక్సీలలో ప్రయాణించగలరు. ఈ ఎయిర్ టాక్సీల ఛార్జీలు కూడా అంత ఖరీదైనవి కావు. చండీఘడ్ నుండి హిసార్ వరకు, వోల్వో బస్సులో ఒక వ్యక్తికి సాధారణ ఛార్జీలు 700 రూపాయలు కాగా ఇక్కడ, ఒక ప్రయాణీకుడు అప్ అండ్ డౌన్‌ రెండు మార్గాలు కలిపి రూ. 1,755 వెచ్చించాల్సి ఉంటుంది.

Also read : Money making tips: మీకు 2 Bank accounts ఉన్నాయా ? వెంటనే ఇలా చేయండి.. లేదంటే మీ జేబుకు చిల్లు ఖాయం

ఎయిర్ ట్యాక్సీ సేవలను ఆపరేట్ చేసేది ఎవరు ? ( Who will operate air taxi ? )
ఎయిర్ టాక్సీ సేవను ఎయిర్ టాక్సీ ఇండియా నిర్వహిస్తుంది. గత ఏడాది డిసెంబర్‌లో ఇండియన్ ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చేత షెడ్యూల్డ్ కమ్యూటర్ ఎయిర్‌లైన్స్ పర్మిట్ కింద లైసెన్స్ మంజూరు చేశారు. ప్రాంతీయ కనెక్టివిటీ స్కీమ్ (RCS) అయిన ఉడాన్‌ పథకం కింద ఈ విమానయాన సంస్థకు 26 మార్గాల్లో సేవలు అందించేందుకు అనుమతి పొందినట్టు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా మెట్రో సిటీలు, టైర్ -2, టైర్ -3 నగరాల మధ్య ఎయిర్ కనెక్టివిటీని అందించాలనే కేంద్రం లక్ష్యానికి అనుగుణంగా ఈ ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభించారు. అంతేకాకుండా, ఎయిర్ టాక్సీ సేవల కోసం టెక్నామ్ పి 2006 టి విమానాలు ఉపయోగిస్తున్నామని, ట్విన్ ఇంజిన్ కెపాసిటీ ఉన్న ఈ విమానాలను కాస్ట్రూజియోని ఏరోనాటిచే టెక్నామ్ సంస్థ తయారు చేసినట్టు ఎయిర్ టాక్సీ ఇండియా వెల్లడించింది.

Also read : Jio vs Vodafone, idea, Airtel: ఇంటర్నెట్ స్పీడ్‌లో ఏది ఎక్కువ ? ఏది తక్కువ తెలుసా ?

ప్రయాణ సమయం, టిక్కెట్లు ఎలా బుక్ చేసుకోవాలి ? ( How to book Air taxi tickets ? )
చండీఘడ్ నుండి హిసార్ వరకు ఉన్న దూరాన్ని ఈ విమానం ద్వారా 45 నిమిషాల్లో కవర్ చేసేందుకు వీలు కలుగుతుంది. ఆన్‌లైన్‌లో ఈ ఎయిర్ ట్యాక్సీ టికెట్స్ బుకింగ్ చేసుకోవచ్చు. ప్రైవేట్ బుకింగ్ సదుపాయాన్ని కూడా సంస్థ అందించింది. ప్రతీ రోజూ నిర్ణీత సమయంలో హిసార్, చండీఘడ్ మధ్య రోజువారీ విమాన సేవలు అందుబాటులో ఉంటాయని.. ఒక ప్రయాణీకుడు టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ ఎయిర్ ట్యాక్సీ సేవలు అందిస్తామని సదరు సంస్థ ప్రకటించింది. UDAN Scheme కింద ప్రస్తుతానికి కొన్ని మార్గాలకే పరిమితమైన ఎయిర్ ట్యాక్సీ సేవలు ( Air taxis services in India ).. డిమాండ్‌నిబట్టి భవిష్యత్తులో మరిన్ని నగరాలకు సైతం విస్తరించే ఆలోచనలో DGCA ఉన్నట్టు తెలుస్తోంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News