Bangladesh నిలకడగా పురోగమిస్తున్న బంగ్లాదేశ్... భారత్‌ను మించి తలసరి ఆదాయం నమోదు

Last Updated : May 12, 2022, 12:31 PM IST
  • తలసరి ఆదాయంలో బంగ్లాదేశ్ భారత్‌ను మించిపోయింది
  • ఇండియా కంటే తమ తలసరి ఆదాయం 280 డాలర్లు ఎక్కువగా నమోదైంది
  • దక్షిణాసియాలో ఇండియా తర్వాత తర్వాత రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన బంగ్లాదేశ్.
Bangladesh నిలకడగా పురోగమిస్తున్న బంగ్లాదేశ్... భారత్‌ను మించి తలసరి ఆదాయం నమోదు

Bangladesh చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇవన్నీ మన పొరుగుదేశాలు. ఆర్థికంగా బాగా బలపడి చైనా ఏకంగా ప్రపంచ స్థాయిలో ఆధిపత్యాన్ని చెలాయించే స్థాయికి ఎదగ్గా.... మిగతా దేశాల పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా పాకిస్తాన్‌ ఇంకా రాజకీయ సుస్థిరత సాధించే స్థాయికి ఎదగలేకపోయింది. కొంత కాలం రాజుల పాలనలో ఆతర్వాత మావోల పాలనలో ఉన్న నేపాల్ పరిస్థితి కూడా ఏమంత బాగా లేదు. ఇక అంతర్యుద్ధంలో ఇరుక్కోపోయిన శ్రీలంక ఇప్పుడు దాని పర్యవసానాలను అనుభవిస్తోంది. దేశం ఆర్థికంగా దివాళా తీసింది. అయితే మరో పొరుగుదేశం బాంగ్లాదేశ్‌ మాత్రం నిలకడగా పురగతిని నమోదు చేస్తోంది.

కిందటి ఏడాది మే నెలలో తలసరి ఆదాయంలో బంగ్లాదేశ్ భారత్‌ను మించిపోయింది. కరోనా కాలంలో మన ఆర్థిక ప్రగతి మందగించా బాంగ్లాదేశ్‌లో మాత్రం ఆ ఛాయలు అంతగా కనపడలేదు. దీంతో భారత్‌ను మించి తలసరి ఆదాయాన్ని నమోదు చేసింది. దీంతో ఇండియా కంటే తమ తలసరి ఆదాయం 280 డాలర్లు ఎక్కువగా నమోదైందని బంగ్లాదేశ్ కేబినెట్ సెక్రటరీ అన్వరుల్ ఇస్లాం గతంలో ప్రకటించారు. కరోనా అనంతరం  సప్లై చైన్ మెరుగు అవడంతో భారత్ పురోగమించింది. తలసరి ఆదాయంలో మన దేశం మళ్లీ బంగ్లాదేశ్‌ను వెనక్కి నెట్టింది. బంగ్లాదేశ్ కంటే 38 డాలర్లు ఎక్కువ తలసరి ఆదాయాన్ని నమోదు చేసింది. అయితే రానున్న రోజుల్లో భారత్‌ను బాంగ్లాదేశ్ తలసరి ఆదాయంలో వెనక్కి నెట్టేస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది.

టెక్స్ టైల్ రంగంలో బాగా స్థిరపడ్డ బంగ్లాదేశ్ అంతర్జాతీయ మార్కెట్‌లోకి ఎక్కువగా టెక్స్ టైల్స్ ఎగుమతి చేస్తోంది. బంగ్లా జీడీపీలో టెక్స్‌టైల్స్ వాటా 20 శాతం వరకు నమోదు అవుతోంది. ఇక మొత్తం ఎగుమతుల్లో టెక్స్ టైల్ వాటా ఏకంగా 80 శాతం వరకు ఉండడం గమనార్హం. అయితే టెక్స్ టైల్ రంగంలో శ్రామిక శక్తి ఎక్కువగా అవసరం అవడంతో ఎక్కువ మందికి ఉపాధి లభిస్తోంది. దీంతో తలసరి ఆదాయం గణనీయంగా నమోదు అవుతోంది. దక్షిణాసియాలో ఇండియా తర్వాత తర్వాత రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన బంగ్లాదేశ్. గత ఆరేళ్లుగా నిలకడైన జీడీపీని నమోదు చేస్తోంది. 2007లో బాంగ్లా తలసరి ఆదాయం మన తలసరి ఆదాయంలో సగం మాత్రమే.... కానీ ఈ పదిహేనేళ్లలో బంగ్లా అద్భుతమైన పురోగతి సాధించింది. భవిష్యత్తులోనూ ఇదే జోరు కొనసాగించే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. దీంతో ఆర్థిక రంగంలో భారత్‌తో పోటీ పడే స్థాయికి త్వరలోనే ఎదిగే స్థాయికి చేరుకుంటుంది.

also read Warranty- Guarantee Difference: గ్యారెంటీ, వారెంటీకి మధ్య వ్యత్యాసం ఏంటో తెలుసా..?

also read LIC IPO Shares Allotment Status: ఎల్ఐసి ఐపిఓ షేర్స్ అలాట్‌మెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News