IT Returns 2024: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, ఇలా చేస్తే 40 వేలవరకూ ప్రయోజనం

IT Returns 2024: ఉద్యోగులంతా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేపనిలో ఉన్నారు. జూలై 31లోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సూచనలు పాటిస్తే భారీగా ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 16, 2024, 11:39 AM IST
IT Returns 2024: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, ఇలా చేస్తే 40 వేలవరకూ ప్రయోజనం

IT Returns 2024: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు చివరి తేదీ జూలై 31. ఇప్పటికే ఫామ్ 16 చేతికి అందినవాళ్లంతా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. ఉద్యోగస్థులు వివిధ మార్గాల్లో ట్యాక్స్ డిడక్షన్ కోసం చూస్తుంటారు. కొన్ని మార్గాలు అనుసరిస్తే అదనంగా 40 వేల వరకూ ట్యాక్స్ డిడక్షన్ ప్రయోజనం పొందవచ్చు. 

ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయమిది. ఇన్‌కంటాక్స్ చట్టంలోని సెక్షన్ 80 సి ప్రకారం 1.5 లక్షల వరకూ మినహాయింపు గురించి అందరికీ తెలిసిందే. ఇది కాకుండా ఇంకా ఇతర పద్ధతుల ద్వారా మరింత ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు. ఇన్‌కంటాక్స్ చట్టంలో ట్యాక్స్ డిడక్షన్ పొందేందుకు చాలా వెసులుబాట్లు ఉన్నాయి. అలాంటి ఓ వెసులుబాటు సెక్షన్ 80 డిడిబి. ఈ సెక్షన్ ఆధారంగా సొంతంగా లేదా మీపై ఆదారపడినవారి చికిత్సకు చేసిన ఖర్చుపై కూడా ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు. ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ట్యాక్స్ పేయర్లు సెక్షన్ 80 DDB ప్రకారం ఒక ఆర్ధిక సంవత్సరంలో చికిత్సకు చేసే ఖర్చు 40 వేల వరకూ ట్యాక్స్ మినహాయింపు అందుకోవచ్చు. ఈ చికిత్సలో న్యూరో, కేన్సర్, రీనల్ ఫెయిల్యూర్, డొమెన్షియా, మోటార్ న్యూరాన్ డిసీజ్, పార్కిన్సన్ , ఎయిడ్స్ వంటివి ఉన్నాయి. అయితే ఈ ట్యాక్స్ డిడక్షన్ ప్రయోజనాలు కేవలం భారతీయులకే వర్తిస్తాయి. తనకు  లేదా తన భార్యకు లేదా తన పిల్లలకు లేదా తనపై ఆధారపడే తన తల్లిదండ్రులు లేదా సోదర సోదరీమణుల చికిత్సకు చేసే ఖర్చుపై 40 వేల వరకూ ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు. సీనియర్ సిటిజన్లకు అయితే 1 లక్ష వరకూ మినహాయింపు ఉంటుంది. 

కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే దానిపై కూడా ట్యాక్స్ డిడక్షన్ వర్తిస్తుంది. ఉదాహరణకు ఏదైనా సీరియస్ వ్యాధి చికిత్సకు 80 వేల వరకూ ఖర్చు చేసి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 30 వేలు అందుకున్నప్పుడు మిగిలిన మొత్తంలో 10 వేలకే ట్యాక్స్ మినహాయింపు పొందగలడు. ఎందుకంటే వీటిపై ట్యాక్స్ మినహాయింపు ఏడాదికి 40 వేల రూపాయలే ఉంటుంది.

Also read: EPFO New Rules: పీఎఫ్ అడ్వాన్స్ విత్‌డ్రా ఇకపై సాధ్యం కాదు, రూల్స్ మారిపోయాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News