ICICI Bank FD Rates: ఐసీసీఐ బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంపు

ICICI Bank Hikes Bulk FD Rates: బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది ఐసీసీఐ బ్యాంక్. తాజాగా పెంచిన రేట్లు ఏప్రిల్ 13వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2023, 03:52 PM IST
ICICI Bank FD Rates: ఐసీసీఐ బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంపు

ICICI Bank Hikes Bulk FD Rates: ఐసీసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఖాతాదారులను ఫిక్స్‌డ్ డిపాజిట్ల వైపు ఆకర్షించేందుకు మంచి వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. ఎఫ్‌డీలో ఇన్వెస్ట్ చేస్తే.. ట్యాక్స్ ఆదా చేసుకోవడంతోపాటు మంచి లాభాలను పొందొచ్చు. ఐసీసీఐ బ్యాంక్ ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు ఫిక్స్‌డ్ డిపాజట్లను అందిస్తోంది. సాధారణ ఎఫ్‌డీల వడ్డీ రేట్లు కాలవ్యవధి, పెట్టుబడి మొత్తాన్ని బట్టి మారుతుంటాయి. ఏప్రిల్ 13వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. రూ.2 కోట్ల వరకు డిపాజిట్లకు ఐసీసీ బ్యాంక్ అందించే వడ్డీ రేట్లు ఇలా.. 

పదవీకాల వడ్డీ రేటు (ఏడాదికి)

==> 7 రోజుల నుంచి 14 రోజుల వరకు 4.75 శాతం
==> 15 రోజుల నుంచి 29 రోజులు 4.75 శాతం
==> 30 రోజుల నుంచి 45 రోజులు 5.50 శాతం
==> 46 రోజుల నుంచి 60 రోజులు 5.75 శాతం
==> 61 రోజుల నుంచి 90 రోజులు 6.00 శాతం
==> 91 రోజుల నుంచి 120 రోజులు 6.50 శాతం
==> 120 రోజుల నుంచి 210 రోజులు 6.65 శాతం
==> 211 రోజుల నుంచి 270 రోజులు 6.65 శాతం
==> 271 రోజుల నుంచి 289 రోజులు 6.75 శాతం
==> 290 రోజుల నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ 6.75 శాతం
==> 18 నెలల నుంచి రెండేళ్ల వరకు 7.15 శాతం
==> 2 సంవత్సరాల 1 రోజు నుంచి మూడేళ్ల వరకు 7.10 శాతం 
==> 3 సంవత్సరాల నుంచి ఐదేళ్ల వరకు 6.75 శాతం
==> ఐదేళ్ల నుంచి ఒక రోజు నుంచి పదేళ్ల వరకు 6.75 శాతం

ఇతర ప్రైవేట్ బ్యాంకులు ఏడాది నుంచి  15 నెలలలోపు మెచ్యూర్ అయ్యే హోల్‌సేల్ ఎఫ్‌డీలపై 7.25 శాతం, 15 నెలల నుంచి రెండేళ్లలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.15 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. మూడేళ్ల నుంచి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీ రేటును, రెండేళ్ల నుంచి మూడేళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 7.00 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. స్టాండర్డ్ డిపాజిట్ల కంటే బల్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. 

Also Read: 8th Pay Commission: ఉద్యోగులకు కేంద్రం బంపర్ గిఫ్ట్.. 8వ వేతన సంఘంపై కీలక నిర్ణయం..?  

ఐసీసీఐ బ్యాంక్ ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్‌తో ట్యాక్స్ ఆదా చేసే ఎఫ్‌డీలను కూడా అందిస్తుంది. ట్యాక్స్ సేవ్ చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలకు వడ్డీ రేటు ఐదేళ్ల నుంచి పదేళ్ల కాలవ్యవధి కలిగిన సాధారణ ఎఫ్‌డీలకు సమానంగా ఉంటుంది. ఏడాదికి  7 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్‌లకు సాధారణ ఎఫ్‌డీల రేట్ల కంటే 0.50 శాతం అదనపు వడ్డీ రేటును అందిస్తోంది ఐసీసీఐ బ్యాంక్. అదేవిధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా చేసిన డిపాజిట్లకు 0.25 శాతం అదనపు వడ్డీ రేటును కూడా ఆఫర్ చేస్తోంది. అయితే మీరు ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించే ముందు ఇతర బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను కూడా తెలుసుకోవడం ఉత్తమం. 

Also Read:  Target Dream11 Prediction: కోల్‌కతా జోరుకు హైదరాబాద్ బ్రేక్ వేసేనా..? కేకేఆర్ Vs ఎస్‌ఆర్‌హెచ్ డ్రీమ్ 11 టిప్స్

Also Read: IPL 2023 Updates: చెన్నైపై గెలిచిన రాజస్థాన్‌కు షాక్.. సంజూ శాంసన్‌కు ఫైన్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News