Hyundai Exter Vs Maruti Suzuki Fronx Cars Price and Mileage: ఇండియాకు పరిచయమైన తొలి మైక్రో ఎస్‌యూవీ కారుగా మారుతి సుజుకి ఇగ్నైస్‌ని చెప్పుకోవచ్చు. ఆ తరువాత ఎప్పుడైతే టాటా పంచ్ కారు లాంచ్ అయిందో.. అప్పటి నుంచి కాంపాక్ట్ ఎస్‌యువీ కార్ల మార్కెట్‌ని తిరుగులేని రారాజుగా ఏలుతోంది. ఇదిలావుండగా కొత్తగా ఇదే కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్ల మార్కెట్లోకి హ్యూందాయ్ ఎక్స్‌టర్ కారు, మారుతి సుజుకి ఫ్రాంక్స్ కార్లు ఎంట్రీ ఇచ్చాయి. ఇండియాలో బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్న హ్యూందాయ్, మారుతి సుజుకి కంపెనీలు లాంచ్ చేసిన ఈ వాహనాలపైనే ఇప్పుుడు కొత్తగా కార్లు కొనే వారి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు కార్లలో ఏది బెస్ట్ అనేది ఆ కార్ల ధరలు, ఫీచర్స్ కంపేర్ చేసి చెక్ చేద్దాం.
హ్యూందాయ్ ఎక్స్‌టర్ కారు ధరల విషయానికొస్తే.. ఈ కారు బేసిక్ వేరియంట్ మోడల్ కారు ఎక్స్‌షోరూం ధర రూ. 6 లక్షలు కాగా.. హై ఎండ్ మోడల్ కారు ధర రూ. 11.72 లక్షలుగా ఉంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు ధరల విషయానికొస్తే... ఈ కారు బేసిక్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 7.46 లక్షలు కాగా టాప్ ఎండ్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 12.98 లక్షలుగా ఉంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారు స్పెసిఫికేషన్స్ Vs మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు స్పెసిఫికేషన్స్
హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారు, మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు.. ఈ రెండూ కూడా కొలతల పరంగా సూపర్ కన్వియేంట్ కార్లుగానే చెప్పుకోవాలి. హ్యుందాయ్ ఎక్స్‌టర్ 3,815 మిమీ పొడవు, 1,710 మిమీ వెడల్పు, 1,631 మిమీ పొడవు ఉంది. అలాగే 2,450 mm వీల్ బేస్, 185 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి. ఇక మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే... 3,995 mm పొడవు, 1,765 mm వెడల్పు, 1,550 mm పొడవు, 2,520 mm వీల్ బేస్, 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారు Vs మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు మైలేజ్, పనితీరు
ఇంజన్ మెకానిజం పరంగా చూస్తే.. హ్యూందాయ్ ఎక్స్‌టర్ కారు కంటే మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఇంకొంత ఉత్తమమైనది అనే చెప్పుకోవచ్చు. ఫ్రాంక్స్ కారు 1.2L NA పెట్రోల్, 1.0L టర్బో-పెట్రోల్ పేర్లతో 2 రకాల ఇంజన్ ఛాయిస్‌లతో లభిస్తుంది. 1.2L NA పెట్రోల్ ఇంజన్ కారు 90 PS/113 Nm ఉత్పత్తి చేస్తే.. 1.0L టర్బో-పెట్రోల్ ఇంజన్ కారు 100 PS/147 Nm లను ఉత్పత్తి చేస్తుంది.
ఇక మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు మైలేజీ విషయానికొస్తే, 5 మాన్వల్ ట్రాన్స్‌మిషన్ గేర్ల కారు 21.79 kmpl మైలేజ్ ఇస్తుండగా.. 5AMT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే కారు 22.89 kmpl మైలేజ్‌ని ఇస్తుంది. అలాగే, టర్బో-పెట్రోల్ వేరియంట్స్‌లో 5MT కారు 21.50 kmpl మైలేజ్ ఇస్తుండగా.. 6ATతో వచ్చే కారు 20.01 kmpl మైలేజ్‌ని అందిస్తుంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ CNG కారు 28.51 km/kgని మైలేజ్‌ని అందిస్తుంది.
ఇది కూడా చదవండి : Tata Altroz Cars: టాటా ఆల్ట్రోజ్‌లో రెండు కొత్త వేరియంట్స్.. రెండూ చీప్ అండ్ బెస్ట్ కార్లే
హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారులో 1.2L NA పెట్రోల్ ఇంజన్‌తో 83 PS పవర్ అవుట్‌పుట్, 114 Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ MTకారు 19.4 kmpl మైలేజ్ ఇస్తే.. , 5 AMT కారు 19.2 kmpl మైలేజీని ఇస్తుంది. హ్యూందాయ్ ఎక్స్‌టర్ సీఎన్జీ కారు 27.1 km/kg మైలేజ్‌ని ఇస్తుంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారుకి హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారుకి మధ్య ధరలు, మైలేజ్, ఇంజన్ పర్‌ఫార్మెన్స్ పరంగా ఉన్న వ్యత్యాసాలు ఏంటో మీరే చూశారో కదా.. ఇక ఏది బెస్టో నిర్ణయించుకోవడం ఇక మీ చేతుల్లోనే ఉంది.
ఇది కూడా చదవండి : Hyundai Sante Fe: హ్యూందాయ్ నుండి ఈ కొత్త కారు చూశారా ? డిజైన్ చూస్తే పిచ్చెక్కిపోతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి