Home Loan Interest Rates: భారీగా పెరిగిన హోమ్ లోన్ వడ్డీ రేట్లు, ఏ బ్యాంకు వడ్డీ ఎంత ఉంది

Home Loan Interest Rates: ఇంటి రుణాలు షాక్ కల్గిస్తున్నాయి. ఆర్బీఐ రెపో రేటు పెంచడం పుణ్యమా అని బ్యాంకులు అదేపనిగా వడ్డీ రేట్లు పెంచేస్తున్నాయి. దేశంలోని ప్రముఖ బ్యాంకుల హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 5, 2022, 07:34 PM IST
Home Loan Interest Rates: భారీగా పెరిగిన హోమ్ లోన్ వడ్డీ రేట్లు, ఏ బ్యాంకు వడ్డీ ఎంత ఉంది

దేశంలో అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచేశాయి. ఇంటి రుణాలపై వడ్డీ రేట్లు ఇటీవలి కాలంగా భారీగా పెరిగిపోయాయి. మొన్నటివరకూ 7 శాతం వరకూ ఉన్న వడ్డీ..ఇప్పుడు 9 వరకూ పెరిగిపోయింది. ఆ వివరాలు మీ కోసం..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటివరకూ రెపో రేటును 190 బేసిస్ పాయింట్లు పెంచింది. ప్రస్తుతం 5.9 శాతంకు చేరుకుంది. ఆర్బీఐ రెపో రేటు పెంచడంతో..బ్యాంకులు లెండింగ్ రేట్లను పెంచడంతో ఈఎంఐలు భారమౌతున్నాయి. ఫలితంగా మొన్నటివరకూ 7 శాతానికి అటూ ఇటూ ఉన్న వడ్డీ రేటు..ఇప్పుడు 9 శాతం వరకూ చేరుకుంది. మీరు కూడా హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే..వివిధ బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లను ఓసారి చెక్ చేసుకోండి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దరఖాస్తుదారుని క్రెడిట్ స్కోర్ ఆధారంగా హోమ్ లోన్ వడ్డీ రేట్లను నిర్ధారిస్తుంది.హోమ్ లోన్స్‌పై వడ్డీ 8.4 శాతం నుంచి 9.05 శాతం వరకూ ఉంది. 

హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు

హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేటు మహిళలకు 8.6 శాతం నుంచి ప్రారంభమైతే..ఇతరులకు 8.65 శాతం నుంచి మొదలవుతుంది. 30 లక్షల వరకూ రుణాలపై 9.1 శాతం వరకూ వడ్డీ ఉంటుంది. ఒకవేళ మీ బ్యాంకు రుణం 30-75 లక్షల మధ్యలో ఉంటే..వడ్డీ రేటు 8.85 నుంచి 9.40 మధ్యలో ఉంటుంది.

ఐసీఐసీఐ బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేటు

ఎస్బీఐ ఆఫర్ చేసినట్టే ఐసీఐసీఐ బ్యాంకు హోమ్ లోన్స్‌పై వడ్డీ అనేది ఆ వ్యక్తి క్రెడిట్ స్కోర్ ఆధారంగా నిర్ణయిస్తోంది. ఇంటి రుణంపై కనీస వడ్డీ 8.4 శాతం నుంచి ప్రారంభమై..9.5 శాతం వరకూ వ్యక్తి ప్రొఫైల్‌ను బట్టి ఉంటుంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్ వడ్డీ రేటు 8.20 శాతం నంచి 9.35 శాతం మధ్యలో ఉంది. ఇది కూడా ఆ వ్యక్తి క్రెడిట్ స్కోర్, ప్రొఫైల్, హోమ్ లోన్‌పై ఆదారపడి ఉంటుంది. 30 లక్షల వరకూ రుణాలకు వడ్డీ రేటు 8.65 శాతం వరకూ ఉంటుంది.

Also read: Gold Price today: మగువలకు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం... షాకిచ్చిన వెండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News