Adani Group: అదానీ గ్రూప్‌ను ముంచేసిన హిండెన్‌బర్గ్ ఎలా సంపాదిస్తుందో తెలుసా

Adani Group: ఆదానీ గ్రూప్‌పై అవకతవకలు, ఎక్కౌంటింగ్ ఫ్రాడ్ ఆరోపణలతో హిండెన్‌బర్గ్ ఒక్కసారిగా చర్చల్లోకెక్కింది. హిండెన్‌బర్గ్ రెండేళ్ల పరిశోధన అనంతరం..అదానీ గ్రూప్‌పై సమగ్ర నివేదిక వెలువరించింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 5, 2023, 11:03 AM IST
Adani Group: అదానీ గ్రూప్‌ను ముంచేసిన హిండెన్‌బర్గ్ ఎలా సంపాదిస్తుందో తెలుసా

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ పేరు ఒక్కసారిగా సంచలనమైంది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల పతనం కొనసాగుతోంది. కంపెనీ మార్కెట్ విలువ పడిపోతోంది. హిండెన్‌బర్గ్ నివేదికతో బిలియన్ల సంపాదన ఆవిరౌతోంది. అదానీ గ్రూప్ షేర్ల పతనం ద్వారా హిండెన్‌బర్గ్ భారీగానే సంపాదించింది. ఆ వివరాలు మీ కోసం..

అదానీ గ్రూప్

హిండెన్‌బర్గ్ గత వారం అదానీ గ్రూప్‌పై అవకతవకలు, ఎక్కౌంటింగ్ మోసాల ఆరోపణలు మోపింది. హిండెన్‌బర్గ్ రెండేళ్ల పాటు పరిశోధన అనంతరం. అదానీ గ్రూప్‌పై నివేదిక వెలువరించింది. ఈ నివేదికలో అదానీ గ్రూప్‌కు చెందిన మాజీ కీలక అధికారుతో జరిగిన సంప్రదింపులు, వేలాది డాక్యుమెంట్లు ఉన్నాయి. ఈ ఆరోపణల్ని గౌతమ్ అదానీ ఖండించారు. 

షార్ట్ సెల్లింగ్

హిండెన్‌బర్గ్ నివేదిక తరువాత అదానీ గ్రూప్ షేర్లలో పతనం కొనసాగింది. అదానీ గ్రూప్ కంపెనీ షేర్లలో భారీగా క్షీణత నమోదైంది. ఫలితంగా హిండెన్‌బర్గ్ కంపెనీ భారీగా లాభాలు ఆర్జించింది. వాస్తవానికి హిండెన్‌బర్గ్ కంపెనీ..అమెరికాలో అదానీ గ్రూప్ కంపెనీల బాండ్లను షార్ట్ పొజీషన్‌లో తీసుకుంది. 

హిండెన్‌బర్గ్ వాస్తవానికి ఓ షార్ట్ సెల్లింగ్ కంపెనీ. దీని ద్వారానే ఈ కంపెనీ ఆదాయం సంపాదిస్తుంటుంది. అదానీ గ్రూప్‌ను కూడా హిండెన్‌బర్గ్ షార్ట్ పొజీషన్ తీసుకుంది. హిండెన్‌బర్గ్ అదానీ షేర్లను షార్ట్ పొజీషన్ తీసుకున్న తరువాతే ఈ నివేదిక వెలువడింది.

షేర్ మార్కెట్‌లో రెండు రకాలుగా సంపాదన ఉంటుంది. మొదటిది ఏదైనా షేర్‌ను కొనుగోలు చేయడం, ఆ షేర్ ధర పెరిగినప్పుడు వాటిని అమ్మడం ద్వారా లాభం సంపాదించడం. దీనిని లాంగ్ పొజిషన్ అంటారు. ఇక రెండవది ఎవరైనా బ్రోకర్ ద్వారా షేర్ అప్పు తీసుకుని దానిని మార్కెట్‌లో ముందు అమ్మడం. షేర్ ధర పడిపోయినప్పుడు ఆ షేర్‌ను కొనుగోలు చేస్తారు. మధ్యలో మార్జిన్ ద్వారా లాభాల్ని ఆర్జిస్తారు. దీనినే షార్ట్ సెల్లింగ్ లేదా షార్ట్ పొజీషన్ అంటారు.

షార్ట్ సెల్లింగ్‌లో భాగంగా ఏదైనా కంపెనీ షేర్ల ధరలు పడిపోయే పరిస్థితి ఉన్నప్పుడు ఆ షేర్లను ముందే భారీ ధరకు అమ్ముతుంటారు. షేర్ పడిపోతున్నప్పుడు ఆ షేర్ల ధరలో ముందు అమ్మిన షేర్లను కొనుగోలు చేస్తారు. ఇలా లాభాల్ని ఆర్జిస్తారు.

Also read: PM Kisan: త్వరలో పీఎం కిసాన్ 13వ విడత డబ్బులు, మీ పేరుందో లేదో చెక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News