GST Council: జీఎస్​టీ కనీస శ్లాబు 5 శాతం నుంచి పెంపు?

GST Council: వచ్చే నెలలో సమావేశం కానున్న జీఎస్​టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకోనుందని సమాచారం. ముఖ్యంగా కనీస జీఎస్​టీ శ్లాబు శాతాన్ని 5 నుంచి పెంచే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 17, 2022, 03:38 PM IST
  • వచ్చే నెలలో జీఎస్​టీ మండలి సమావేశం
  • శ్లాబుల్లో సవరణకు అవకాశం
  • కనీస శ్లాబు శాతాన్ని పెంచేందుకు ప్రతిపాదన!
GST Council: జీఎస్​టీ కనీస శ్లాబు 5 శాతం నుంచి పెంపు?

GST Council: జీఎస్​టీ వల్ల ఏర్పడే ఆదాయ లోటును రాష్ట్రాలే స్వయంగా భర్తీ చేసుకునేందుకు వీలుంగా వచ్చే జీఎస్​టీస సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనుందట కేంద్రం. వచ్చే నెల జీఎస్​టీ మండలి సమావేశం జరగనున్న నేపథ్యంలో పలు కీలక విషయాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవవచ్చని తెలిసింది.

విశ్వసనీయ వర్గాల ప్రకారం.. జీఎస్​టీ శ్లాబుల్లో మార్పుల ప్రతిపాదన తెరపైకి రావచ్చని సమాచారం. ప్రస్తుతం జీఎస్​టీలో కనీసం 5 శాతం, గరిష్ఠంగా 28 శాతం జీఎస్​టీ పన్నులు వసూలవుతున్నాయి. మొత్తం జీఎస్​టీలో 5, 12, 18, 28 శాతం చొప్పున శ్లాబులు ఉన్నాయి. కాగా శ్లాబు అయిన 5 శాతాన్ని ఎత్తేవేయాలని యోచనలో కేంద్రం ఉందట. ఇదే విషయాన్ని మండలి ముందుకు వచ్చే సమావేశంలో తీసుకురావాలని భావిస్తోందని తెలుస్తోంది. దీనికో బదులు రెండు కొత్త శ్లాబులను తీసుకువచ్చే యోజనలో ఉందని సమాచారం.

ఇక 5 శాతం శ్లాబులోకి వచ్చే వస్తు, సేవల్లో కొన్నింటిని 3 శాతం, మరికొన్నింటిని 8 శాతం శ్లాబులోకి తేనున్నట్లు తెలిసింది. మరోవైపు 5 శాతం శ్లాబును, 7, 8, 9 శాతానికి పెంచాలనే చర్చర తీవ్రంగా సాగుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన లేదు.

శ్లాబు శాతం పెంచడం వల్ల ఏమవుతుంది?

ప్రస్తుతం 5శాతంగా ఉన్న జీఎస్​టీ కనీస శ్లాబును పెంచడం వల్ల ప్రభుత్వానికి అదనపు ఆదాయం చేకూరుతుంది. మరోవైపు ప్రస్తుతం జీఎస్​టీ మినహాయింపు ఉన్న వస్తువులను కూడా.. పన్ను పరిదిలోకి తెచ్చే అవకాశాలున్నాయట. దీని ద్వారా కూడా ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఫలితంగా రాష్ట్రాలకు నష్టపరిహారం చెల్లించే బదులు.. ఆదాయ మార్గం చూపించినట్లవుతుందని కేంద్రం భావిస్తోందట. 5 శాతం జీఎస్​టీని 8 శాతంగా మార్చడం వల్ల ప్రభుత్వానిక అదనంగా ఏటా 1.5 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరనుందట, 6 శాతానికి పెంచితే దాదాపు రూ.50 వేల కోట్ల ఆదనపు ఆదాయం వస్తుందని అంచనాలు ఉన్నాయి.

Also read: Flipkart TV Days: స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా.. ఫ్లిప్‌కార్ట్‌లో సగం కన్నా తక్కువ ధరకే 5 స్మార్ట్ టీవీలు

Also read: Sri Lanka Crisis: శ్రీలంకలో ముదురుతున్న సంక్షోభం- స్టాక్​ ఎక్స్ఛేంజీ తాత్కాలికంగా మూసివేత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News