Channels block: నకిలీ వార్తలు ప్రసారం.. 22 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం వేటు

Channels block: నకిలీ వార్తలపై కేంద్రం మరోసారి సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఇందులో భాగంగా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న 22 యూట్యూబ్ ఛానెళ్లను నిషేధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2022, 03:49 PM IST
  • నకిలీ వార్తలు సృష్టిస్తున్న ఛానెళ్లపై కేంద్రం కొరడా
  • 22 యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం..
  • పలు సామాజిక మాధ్యమ ఖాతాలపైనా వేటు
Channels block: నకిలీ వార్తలు ప్రసారం.. 22 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం వేటు

Channels block: కేంద్రం మరోసారి నకిలీ వార్తలు ప్రసారం చేస్తున్న యూట్యూబ్​ ఛానెళ్లపై కొరడా ఝులిపించింది. మొత్తం 22 యూట్యూబ్​ ఛానెళ్లను బ్లాక్​ చేస్తూ ఏప్రిల్​ 4న ఆదేశాలు జారీ చేసినట్లు.. మంగళవారం ప్రకటించింది. వీటితో పాటు.. మూడు ట్విట్టర్​ ఖాతాలు, ఓ ఫేస్​బుక్​ ఖాతా, ఓ న్యూస్ వెబ్​సైట్​పై వేటు వేసింది. ఐటీ రూల్స్​ 2021ను అనుసరించి భారత్​కు సంబంధించిన యూట్యూబ్​ ఛానెళ్లు, ఇతర సామాజిక మధ్యమాల ఖాతాలపై వేటు వేయడం ఇదే తొలిసారి.

ఛానెళ్ల వివరాలు ఇలా..

తాజాగా నిషేధం విధించిన 22 యూట్యూబ్​ ఛానెళ్లలో 18 ఛానెళ్లు మన దేశానికి చెందినవి కాగా.. 4 ఛానెళ్లు పాకిస్థాన్​కు చెందినవిగా తెలిపింది కేంద్రం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఐ అండ్​ బీ) పేర్కొంది.

ఈ యూట్యూబ్ ఛానెళ్లన్నింటికి కలిపి.. మొత్తం 260 కోట్ల మేర వ్యూస్ ఉన్నట్లు తెలిపింది ఐ అండ్​ బీ.

వేటు ఎందుకు?

వేటు పడిన ఛానెళ్లన్నీ నకిలీ వార్తలను ప్రసారం చేయడం, సామాజిక మధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని షేర్ చేయడం, ముఖ్యంగా జాతీయ భద్రత, విదేశీ వ్యవరహాలు, ప్రజా సంబంధి వ్యవహారాల్లో తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం వంటివి చేస్తున్నట్లు ఐ అండ్​ బీ గుర్తించింది.

తప్పుడు థంబ్​ నెయిల్స్​, వార్తా ఛానెళ్లను పోలిన లోగోలను వాడి.. తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నాయని కూడా వెల్లడించింది ఐ అండ్​ బీ పేర్కొంది.

కొత్త ఐటీ రూల్స్ అమలులోకి వచ్చిన తర్వాత.. 2021 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు మొత్తం 78 యూట్యూబ్ వార్తా ఛానెళ్లను ఇండియాలో బ్యాన్​ చేసేందుకు ఆదేశాలిచ్చింది కేంద్రం. వాటితో పాటు పెద్ద సంఖ్యలో సమాజిక మాధ్యమ ఖాతాలను కూడా.. జాతీయ భద్రత, సార్వ భౌమాధికారానికి భంగం కలిగిస్తున్నాయన్న కారణంతో నిషేధించింది.

Also read: Whats App: వాట్సాప్‌ సంచలన నిర్ణయం.. మెసేజ్ ఫార్వర్డ్‌ చేయడం ఇక నుంచి కుదరదు..!

Also read: Petrol Price Today: భారీగా పెరిగిన ఇంధన ధరలు.. లీటర్ పెట్రోల్ ధర రూ.120!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News