Free Visa Entry: కోవిడ్ మహమ్మారి ముగిసిన తరువాత ప్రతి దేశం పర్యాటకానికి ప్రాముఖ్యత ఇస్తూ పర్యాటకుల్ని పెంచుకునేందుకు యోచిస్తున్నాయి. వివిధ రకాల టూరిజం ప్లాన్స్ ప్రకటిస్తున్నాయి. రానున్నది క్రిస్మస్, న్యూ ఇయర్ కావడంతో కొన్ని దేశాలు భారతీయ పర్యాటకులకు ఉచిత వీసా సౌకర్యం కల్పిస్తున్నాయి. ఏయే దేశాల్లో ఈ సౌకర్యం ఉందో పరిశీలిద్దాం.
కోవిడ్ 19 ముగిసిన తరువాత ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం ఊపందుకుంటోంది. ఆయా దేశాలు కూడా అందుకు తగ్గ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కోవిడ్ భయం ముగియడంతో అందరూ విదేశీయానంపై ఆసక్తి చూపిస్తున్నారు. వింటర్ వెకేషన్ నడుస్తోంది ఇప్పుడు. ఓ వైపు క్రిస్మస్ మరోవైపు న్యూ ఇయర్ వేడుకలు కూడా విదేశాల్లో అత్యంత ఘనంగా జరిగే పరిస్థితి ఉంటుంది. అందుకే చాలా దేశాలు భారతీయ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు ఉచిత వీసా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. ముఖ్యంగా థాయ్‌లాండ్, శ్రీలంక, భూటాన్, మలేషియా దేశాలు వీసా లేకుండానే భారతదేశ పర్యాటకుల్ని ఆహ్వానిస్తున్నాయి.
మలేషియా దేశం భారతదేశం నుంచి వచ్చే పర్యాటకులకు ఉచిత వీసా అందిస్తున్నట్టు ప్రకటించింది. ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం భారతదేశంతో పాటు చైనా పర్యాటకులకు 30 రోజుల ఉచిత వీసా ఇస్తున్నామని తెలిపారు. అంటే మలేషియా వెళ్లాలనుకుంటే ఇప్పుడిక వీసా అవసరం లేదు. ఎయిర్‌పోర్ట్‌లోనే అప్పటికప్పుడు వీసా పొందవచ్చు. ఇప్పటివరకూ అయితే ముందుగా విదేశాంగ శాఖ నుంచి వీసా తీసుకోవల్సి వచ్చేంది. ఇకపై ఎయిర్‌పోర్ట్‌లో అప్పటికప్పుడు ఎలాంటి ఆంక్షల్లేకుండా టికెట్‌తో పాటు వీసా తీసుకుని వెళ్లవచ్చు.
మలేషియా ప్రకటించిన ఉచిత వీసా సౌకర్యం కేవలం ఇండియా, చైనా పర్యాటకులకు మాత్రమే. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. మలేషియాలోకి స్వేచ్ఛగా ప్రవేశించే పరిస్థితి ఉందిప్పుడు. కావల్సిందల్లా పాస్‌పోర్ట్, రిటర్న్ టికెట్ ప్రూఫ్, మలేషియాలో హోటల్ బుకింగ్ చూపించాల్సి ఉంటుంది. ఆ దేశంలో టూరిజం ప్రోత్సహించేందుకు ఈ చర్యలు తీసుకుంది.
మరోవైపు థాయ్‌లాండ్ కూడా భారతీయలుకు ఉచిత వీసా ఎంట్రీ కల్పిస్తోంది. ఏ విధమైన వీసా ఫీజు చెల్లించకుండానే ఆ దేశానికి వెళ్లే అవకాశముంది. వాస్తవానికి థాయ్‌లాండ్ దేశానికి వెళ్లే పర్యాటకులు ఎయిర్‌పోర్ట్‌లో వీసా ఫీజులు 3 వేలు చెల్లించాల్సి వచ్చేది. ఇకపై ఈ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. భారతీయ పర్యాటకులకు ధాయ్ ప్రభుత్వం కల్పించిన ఈ సౌకర్యం 2024 మే వరకూ ఉంటుంది.
మరోవైపు శ్రీలంక దేశం కూడా పర్యాటకాన్ని పెంచేందుకు ఇండియా, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్ దేశాలకు వచ్చే ఏడాది మార్చ్ 31 వరకూ ఉచిత వీసా సౌకర్యం కల్పిస్తోంది. శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక భూటాన్ దేశంలో ఇండియాకు ఎప్పట్నించో ఫ్రీ ఎంట్రీ ఉంది. మరోవైపు వియత్నాం కూడా భారతీయులకు ఉచిత వీసా సౌకర్యం కల్పిస్తోంది.ఇప్పటి వరకూ వియత్నాం దేశంలో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, డెన్మార్క్, స్వీడర్, ఫిన్‌లాండ్ దేశస్థులకు ఫ్రీ వీసా ఉంది. ఇకపై భారతీయులకు కూడా ఉంటుంది.
Also read: Share Market: ఈ వారం ఐపీవోలు, ఇన్వెస్ట్ చేయాలంటే ఏం చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook