Todays Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధర, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు

Todays Gold Rate: బంగారం ప్రియులకు కొత్త ఏడాది నిరాశ కల్గిస్తోంది. వరుసగా నాలుగు రోజులు కూడజా బంగారం ధర పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 4, 2022, 06:56 AM IST
  • కొత్త ఏడాదిలో నిరాశ పరుస్తున్న బంగారం ధరలు
  • వరుసగా నాలుగవరోజు కూడా స్వల్పంగా పెరిగిన బంగారం ధర
  • వెండి ధరల్లో గణనీయంగా పెరుగుదల నమోదు
 Todays Gold Rate: మళ్లీ పెరిగిన బంగారం ధర, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు

Todays Gold Rate: బంగారం ప్రియులకు కొత్త ఏడాది నిరాశ కల్గిస్తోంది. వరుసగా నాలుగు రోజులు కూడజా బంగారం ధర పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

కొత్త ఏడాది ప్రారంభమవుతూనే బంగారం ధర పెరగడం మొదలైంది. స్వల్పంగానైనా సరే ప్రతిరోజూ బంగారం ధర పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, డాలర్ విలువ వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే ప్రతిరోజూ బంగారం ధర మారుతుంటుంది. ఈ నేపధ్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల 47 వేల 4 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర (Gold Rate) 51 వేల 710 రూపాయలుగా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 250 అయితే..24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 250 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 5 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 640 రూపాయలుగా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 47 వేల 450 రూపాయలైతే..24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 50 వేల 150 రూపాయలుగా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 250 రూపాయలైతే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 360 రూపాయలుగా ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 250 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 360 రూపాయలుంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో (Hyderabad Gold Price) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 250 రూపాయలైతే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 49 వేల 360 రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45 వేల 250 రూపాయలుగా ఉంది. ఇక విశాఖపట్నంలో కూడా అదే ధర కొనసాగుతోంది.  

Also read: CIBIL SCORE: మీ సిబిల్ స్కోర్ బాగోలేదా..సిబిల్ స్కోర్ ఎలా మెరుగుపర్చుకోవాలో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News