Gold rate on December 31 2021 : తెలుగు రాష్ట్రాలు సహా దేశీయ మార్కెట్‌లో నేటి బంగారం ధరల వివరాలు

Gold rate on December 31 2021 : దేశీయ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు, సెంట్రల్ రిజర్వ్ బ్యాంకులో బంగారం నిల్వలు, వడ్డీ రేటులో అస్థిరత తదితర అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2021, 07:11 AM IST
  • హైదరాబాద్ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
  • దేశంలోని అన్ని ప్రధాన మార్కెట్లలో రూ.50వేలకు దిగువన బంగారం ధరలు
  • అత్యధికంగా ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,320
Gold rate on December 31 2021 : తెలుగు రాష్ట్రాలు సహా దేశీయ మార్కెట్‌లో నేటి బంగారం ధరల వివరాలు

Gold rate on December 31 2021 : బంగారం పట్ల భారతీయ మహిళలకు ఉండే మక్కువ, ఆసక్తి అంతా ఇంతా కాదు. పండుగలకు, శుభకార్యాలకు ఒంటి నిండా నగలతో ముస్తాబైతే వారి ఆనందానికి అవధులు ఉండవు. కొంతమంది ఏ చిన్న శుభకార్యమైనా కొద్ది మొత్తంలోనైనా బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. మరికొంతమంది బంగారాన్ని ఒక పెట్టుబడిగా భావిస్తారు. అందుకే బంగారం ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. ఇవాళ దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం...

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు: 

హైదరాబాద్ మార్కెట్‌లో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.250 మేర ధర తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.270 మేర ధర తగ్గింది.

విజయవాడలో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990గా ఉంది.

దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరలు:

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,320గా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,760
ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,760గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,020 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,120గా ఉంది. 
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,750 ఉంది.

 బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990గా ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990గా ఉంది.

Also Read: Horoscope Today, 31 December 2021 : ఆ రాశి వారికి స్నేహితుడే ద్రోహిగా మారే ఛాన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News