Todays Gold Rate: ఇవాళ ఏప్రిల్ 10, 2022 దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు

Todays Gold Rate: బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో భారీగా పెరిగిన బంగారం ధర పసిడి ప్రియులకు షాక్ ఇస్తోంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 10, 2022, 07:17 AM IST
Todays Gold Rate: ఇవాళ ఏప్రిల్ 10, 2022 దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు

Todays Gold Rate: బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో భారీగా పెరిగిన బంగారం ధర పసిడి ప్రియులకు షాక్ ఇస్తోంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా వివిధ కారణాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. ముఖ్యంగా కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వ, వడ్డీ రేట్లు, డాలర్ విలువ, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే బంగారం ధరలు ప్రతి రోజూ మారుతుంటాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో గత కొద్దికాలంగా బంగారం ధరలు అమాంతంగా పెరుగుతూ పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 6 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 20 రూపాయలుంది. అటు ముంబైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 6 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 20 రూపాయలుగా కొనసాగుతోంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 49 వేల 190 రూపాయలుండగా...24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 20 రూపాయలుంది. ఇక కేరళలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 6 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 20 రూపాయలుగా ఉంది. ఇక కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 6 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 20 రూపాయలుంది. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 6 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 20 రూపాయలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 6 వందలైతే..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 20 రూపాయలుంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. 

Also read: PAN Aadhaar: ఇంకా పాన్​-ఆధార్​ లింక్ చేయలేదా? ఈ విషయాలు తెలుసుకోండి ఇప్పుడే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News