Todays Gold Rate: మళ్లీ పెరుగుతున్న బంగారం,, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold Rate: బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. గత కొద్దికాలంగా భారీగా పెరిగిన బంగారం..ఇటీవల స్వల్పంగా తగ్గింది. ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 9, 2022, 06:58 AM IST
Todays Gold Rate: మళ్లీ పెరుగుతున్న బంగారం,, దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold Rate: బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. గత కొద్దికాలంగా భారీగా పెరిగిన బంగారం..ఇటీవల స్వల్పంగా తగ్గింది. ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 

ప్రపంచ వ్యాప్తంగా వివిధ కారణాలు బంగారం ధరపై ప్రభావం చూపిస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్, డాలర్ విలువ, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గత రెండు నెలలుగా భారీగా పెరిగింది. ఆ తరువాత స్వల్పంగా తగ్గింది. ఇప్పుడు మరోసారి పెరుగుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

దేశ రాజధాని ఢిల్లీలో  22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 250 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 630 రూపాయలుగా ఉంది. ఇక దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 820 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 260 రూపాయలుంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధఱ 48 వేల 820 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 53 వేల 260 రూపాయలుంది. ఇక కోల్‌కతా‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 250 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 630 రూపాయలుంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 250 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 630 రూపాయలుంది. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 250 రూపాయలుండగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 630 రూపాయలుంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 250 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 630 రూపాయలుంది. ఇక విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. 

Also read: EPFO New Rules: మారిన ఈపీఎఫ్​ఓ రూల్స్​.. చందాదారులకు తెలుసుకోవాల్సిన విషయాలివే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News