Gold Rate Today 19 April 2024: బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశన్నంటాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలు చేసుకునేవారు మధ్యతరగతి కుటుంబీకులకు కూడా ఇది మింగుడు పడని విషయం. ముఖ్యంగా ఆడవాళ్లకు కూడా బంగారం అంటే మక్కువ. అందుకే వారు ఏమాత్రం షాపింగ్ చేయాలన్నా మొదటి ప్రాధాన్యత బంగారానికే ఇస్తారు. ఆ తరువాతే ఏదైనా. ఒక్కసారిగా అంత డబ్బు పెట్టి బంగారం కొనుగోలు చేయలేనివారు కనీసం నెలనెలా స్కీము కడుతూ బంగారం కొనుగోలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఇలా గోల్డ్ రేట్స్ ఆకాశన్నంటడంతో బెంబేలెత్తిపోతున్నారు. అయితే, బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు దేశవ్యాప్తంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఈరోజు అంటే 2024 ఏప్రిల్ 19 నాటికి బంగారం ధరలు పెరిగాయి. నిన్న తులం బంగారం ధర బులియన్ మార్కెట్లో 24 క్యారట్లు రూ.73,790 ఉండగా ఈరోజు రూ. 74,000 కు ఎగబాకింది. అయితే, 22 క్యారట్ల బంగారం ధర రూ. 67,640 వద్ద ఉంది. వెండి కూడా ఇదే బాటలో ఎగబాకుతూ కేజీ రూ. 86,400 వద్ద ఉంది.
ఇదీ చదవండి: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఇంట్లోంచి ఎలా ఫైల్ చేయాలి, ఏమేం అవసరం
హైదరాబాద్‌లో తులం బంగార ధర..
హైదరాబాద్‌లో తులం బంగారం (10 గ్రాములు) 24 క్యారట్లు రూ. 73,790 వద్ద ఉంది. అదే 22 క్యారట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 67,640 వద్ద ఉంది. వివిధ ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. చెన్నైలో తులం బంగారం ధర 24 క్యారట్లు (10 గ్రాములు) రూ. 74,550 వద్ద ఉండగా, 22 క్యారట్లు తులం బంగారం రూ. 68,340 వద్ద ఉంది.ఇక హైదరాబాద్, చెన్నైతోపాటు ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పట్టిక రూపంలో చూద్దాం..
ఇదీ చదవండి: పసిడి ప్రియులకు ఊరట.. తులం బంగారం ధర ఈరోజు ఎంత ఉందంటే?
నగరం | 22 క్యారట్లు | 24-క్యారట్లు |
హైదరాబాద్ | రూ. 67,640 | రూ. 73,790 |
చెన్నై | రూ. 68,340 | రూ. 74,550 |
కోల్ కత్తా | రూ. 67,640 | రూ. 73,790 |
లక్నో | రూ. 67,790 | రూ. 73,940 |
బెంగళూరు | రూ. 67,640 | రూ. 73,790 |
జైపూర్ | రూ. 67,790 | రూ. 73,940 |
మన దేశంలో బంగారం ధర తరచుగా రిటైల్ గోల్డ్ రేట్‌ను సూచిస్తుంది. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. వినియోగదారులు బంగారం కొనుగోలు చేసే సమయానికి ఎంత ఉంటే అంత చెల్లించాల్సి ఉంటుంది.ఇక కొనసాగుతున్న మార్కెట్ ఒడిదుడుకుల మధ్య పెట్టుబడిదారులు, ట్రేడర్లు ఈ పరిణామాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook