Todays Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్, తగ్గిన బంగారం ధర, దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold Rate: పసిడి ప్రియలకు గుడ్‌న్యూస్. గత కొద్దిరోజుల్నించి పెరుగుతున్న బంగారం ధర కాస్త తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 27, 2022, 07:37 AM IST
 Todays Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్, తగ్గిన బంగారం ధర, దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు

Todays Gold Rate: పసిడి ప్రియలకు గుడ్‌న్యూస్. గత కొద్దిరోజుల్నించి పెరుగుతున్న బంగారం ధర కాస్త తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 

బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, డాలర్ విలువ, అంతర్జాతీయంగా బంగారం డిమాండ్, వడ్డీ రేట్లు, కేంద్ర రిజర్వ్ బ్యాంకులో బంగారం నిల్వ వంటివి ప్రభావం చూపిస్తుంటాయి. గత కొద్దిరోజులుగా బంగారం ధర మరోసారి పెరుగుతూ వస్తోంది. ఇవాళ బంగారం ధర కొద్దిగా తగ్గింది. పది గ్రాముల బంగారంపై 240 రూపాయల వరకూ తగ్గింది. దేశంలోని వివిధ ప్రాంతాలో బంగారం ధరలు ఇవాళ అంటే మే 27న ఎలా ఉన్నాయో చూద్దాం.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 9 వందలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 9 రూపాయలుంది. ఇక దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 9 వందలు కాగా..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 9 రూపాయలుంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 9 వందలుంటే..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 9 రూపాయలుగా ఉంది. ఇక కేరళలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 9 వందలుంది. అటు 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 9 రూపాయలుగా ఉంది. ఇక చెన్నైలో మాత్రం అత్యధికంగా 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 370 రూపాయలుంటే..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 529 రూపాయలుంది. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 9 వందలు పలుకుతుంటే..24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 52 వేల 9 రూపాయలుంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

Also read: F3 Movie review and rating: ఎఫ్ 3 బొమ్మ అదిరిందట, ట్విట్టర్ రివ్యూ ఎలా ఉంది. రేటింగ్ ఎంత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News