Year ending 2021: కొత్త సంవత్సరం సమీపిస్తోంది. మరో వారం తర్వాత 2022లోకి అడుగు పెట్టబోతున్నాం. అప్పుడే సెలెబ్రేషన్స్‌పై కసరత్తు చేస్తున్నారు చాలా మంది. అయితే అంతకన్నా ముందు పూర్తి చేయాల్సిన కొన్ని ముఖ్యమైన ఆర్థికపరమైన పనులు ఉన్నాయి. డిసెంబర్ 31లోగా ఈ పనులను పూర్తి చేయకుంటే మీకు ఇబ్బందులు రావచ్చు. మరీ ఆ పనుల వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ (ITR filing)..
2021-22 రివ్యూ ఇయర్‌కు గానూ ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేసేందుకు ఈ నెలాఖరు (డిసెంబర్ 31) చివరి తేదీ. కరోనా సహా వివిధ కారణాలతో ఇప్పటికే ఈ గడువును పలుమార్లు పెంచింది ఆర్థిక శాఖ. ఇప్పటికే గడువు చాలా సార్లు పెంచిన నేపథ్యంలో మరోసారి పెంచే యోచనలో ప్రభుత్వం లేదని అంచనాలు వస్తున్నాయి. కాబట్టి వీలైనంత త్వరగా ఇన్‌కం ట్యాక్స్ రిటర్ను ఫైల్ చేయడం ముఖ్యం. లేదంటే ఆలస్య రుసుము కింద రూ.5 వేల వరకు భారం పడొచ్చు.
లైఫ్ సర్టిఫికెట్ సమర్పించారా (Submitting Life Certificate)?
పెన్షనర్లు ప్రతి ఏటా.. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం తప్పనిసరి. పెన్షన్‌దారు జీవించే ఉన్నట్లు నిర్ధారించుకునేందుకు ఉద్దేశించినదే ఈ లైఫ్ సర్టిఫికెట్. పెన్షన్ తీసుకునే ఖాతా ఉన్న బ్యాంక్‌లో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఎస్బీఐ డోర్‌స్టెప్ లైఫ్ సర్టిఫికెట్ సదుపాయాన్ని కూడా అదిస్తోంది. పోస్టాఫీసుల్లో కూడా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించొచ్చు.
నిజానికి నవంబర్‌తో ఈ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు తుది గడువు ఉండగా.. దానిని డిసెంబర్ 31కి పెంచారు. తాజాగా ఆ గడువు కూడా సమీపిస్తోంది. కాబట్టి పెన్షన్‌దారులు వీలైనంత త్వరగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడం మేలు. లేదంటే వచ్చే నెల నుంచి పెన్షన్ తీసుకోలేరు.
డీమ్యాట్ కేవైసీ (KYC Of Demat Accounts)..
ట్రేడింగ్ చేయాలంటే డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. ఇటీవల దేశంలో డీమ్యాట్ ఖాతాలు విపరీతంగా పెరిగాయి. దీనితో డీమ్యాట్ ఖాతాదారులు కేవైసీ పూర్తి చేసేందుకు తొలుత నవంబర్ 30ను తుది గడువుగా పెట్టింది సెబీ. గత నెలాఖరులో ఈ గడువును డిసెంబర్ 31కి పెంచింది. కాబట్టి ఈ గడువులోగా కేవైసీ పూర్తి చేయాలి. లేదంటే డీమ్యాట్ ఖాతా క్లోజ్ అయ్యే అవకాశముంది.
ఆధార్ యూఏఎన్ లింక్ (UAN link with Aadhar)
యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేస్తున్నట్లు ఈ ఏడాది తొలినాళ్లలోనే ప్రకటించింది ఈపీఎఫ్ఓ. కొవిడ్ కారణంగా ఈ గడువును పలుమార్లు పొడగించింది. అయితే ఈ గడువు ఏడు ఈశాన్య రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల ఈపీఎఫ్ఓ చందాదారులకు ఇదివరకే ఈ గడువు ముగిసింది. ఆయా రాష్ట్రాలకు చెందిన వారు గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకుంటే.. తమ సంస్థ జమ చేసే పీఎఫ్ మొత్తం ఖాతాల జమ కాదు.
Also read: Stock Market today: వరుస లాభాలకు వారాంతంలో బ్రేక్- సెన్సెక్స్ 191 మైనస్
Also read: Bank Holidays December 2021: ఆరు రోజులు మూతపడనున్న బ్యాంకులు.. ఏఏ రోజుల్లో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook