FDI in india: ఇండియాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. కరోనా సంక్షోభ సమయంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 శాతం పెట్టుబడులు పెరిగాయి.
ఇండియాలో విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (Foreign Direct Investments)ఇటీవల గణనీయంగా పెరిగినట్టు కేంద్ర వాణిజ్య శాఖ అధికారికంగా వెల్లడించింది. కరోనా సంక్షోభ సమయంలో సైతం విదేశీ పెట్టుబడుల వెల్లువ కొనసాగిందని కేంద్ర వాణిజ్యశాఖ స్పష్టం చేసింది. 2020-21 ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 40 శాతం పెరిగి..51.47 బిలియన్ డాలర్లకు చేరిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 2019-20 ఆర్ధిక సంవత్సరం మొదటి 9 నెలల్లో దేశంలో వచ్చిన ఎఫ్‌డీఐల విలువ 36.77 బిలియన్ డాలర్లుగా ఉంది.
2020-21 తొలి 9 నెలల్లో ఎఫ్డీ ఈక్విటీ (FD Equity) ప్రవాహం 40 శాతం పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 2020-21 మూడవ త్రైమాసికంలో అంటే అక్టోబర్-డిసెంబర్లో 37 శాతం పెరిగి 26.16 బిలియన్ డాలర్లకు చేరుకుంది. డిసెంబర్ నెలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 24 శాతం పెరిగి 9.22 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఇదంతా గత ఆరేళ్లుగా ఎఫ్‌డీఐ(FDI Policy) విధాన సంస్కరణలు పెట్టుబడుల ప్రోత్సాహకాలు, సులభతర వాణిజ్య విధానాలతో దేశంలో ఎఫ్‌డీఐల ప్రవాహం పెరిగినట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Also read:: Realme: భారత్‌లో అత్యంత చవకైన 5G స్మార్ట్‌ఫోన్ Realme Narzo 30 Pro విక్రయాలు ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook