Flipkart Sale: ఫ్లిప్​కార్ట్ కూల్ ఆఫర్స్.. రూ.12 వేల కూలర్ కేవలం రూ.7,515కే!

Flipkart Sale: కూలర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. ఫ్లిప్​కార్ట్​లో రూ.11,999 విలువైన కూలర్​ను.. రూ.7,515కే కొనే వీలుంది. ఆఫర్​ పూర్తి వివరాలు మీకోసం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2022, 02:29 PM IST
  • ఫ్లిప్​కార్ట్​లో ప్రారంభమైన సమ్మర్​ డిస్కౌంట్లు
  • కూలర్లపై భారీగా తగ్గింపులు
  • బ్యాంక్ ఆఫర్లతో మరింత తగ్గనున్న ధరలు..
Flipkart Sale: ఫ్లిప్​కార్ట్ కూల్ ఆఫర్స్.. రూ.12 వేల కూలర్ కేవలం రూ.7,515కే!

Flipkart Sale: చలికాలం ముగింపు దశకు చేరుకుంది. ఇప్పుడిప్పుడే ఎండా కాలం ప్రారంభమవుతోంది. మరో కొన్ని రోజుల్లో ఎండలు మరింత పెరగొచ్చని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు కొనేందుకు సిద్ధమవుతుంటారు.

ఏసీలు కొనేందుకు డబ్బు భారీగా వెచ్చించే పరిస్థితి లేని వారు.. కూలర్లలోనే మంచి క్వాలిటీ ప్రోడక్ట్​ కొనేందుకు మొగ్గు చూపుతుంటారు. అలాంటి వారికోసం ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్​కార్ట్ అదిరే ఆఫర్లతో సేల్ నిర్వహిస్తోంది. వివిధ రకాల కూలర్లపై భారీ డిస్కౌంట్ ఇస్తోంది.

సింఫనీ 70 లీటర్​ డెసర్ట్ ఎయిర్ కూలర్.. 

ఈ కూలర్ మార్కెట్ ధర రూ.11,999గాఉంది. అయితే ఫ్లిప్​కార్ట్ స్పెషల్ ఆఫర్​ కింద 22 శాతం (రూ.2,700) తగ్గింపు ఇస్తోంది. అంటే ఈ కూలర్​ను రూ.9,299కే దక్కించుకునే వీలుంది.

దీనితో పాటు.. బ్యాంక్ ఆఫర్​ కూడా ఇస్తోంది ఫ్లిప్​కార్ట్​. యాక్టిస్​ బ్యాంక్ క్రెడిట్​ కార్డు ద్వారా చెల్లింపు జరిపితే 10 శాతం.. రూ.884 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

ఈ ఆఫర్​ను వ్యాల్యూ పూర్తిగా లభిస్తో.. ప్రోడక్ట్ ధర రూ.8,415కి తగ్గుతుంది. ఆఫర్ ఇంతటితో అయిపోలేదండోయ్​..

కూలర్​పై కూడా ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఇస్తోంది ఫ్లిప్​కార్ట్. పాత కూలర్​ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.900 వరకు తగ్గింపు పొందొచ్చు.

అన్ని ఆఫర్లను కలిపితే.. రూ.7,515కే ఈ ఎయిర్​ కూలర్​ను దక్కించుకోవచ్చు.

Also read: SBI Alert: ఈ ఆరు జాగ్రత్తలతో మీ ఆన్​లైన్ పేమెంట్స్ అత్యంత సురక్షితం!

Also read: New Smartphones: దేశీయంగా ఈ వారం విడులయ్యే స్మార్ట్​ఫోన్లు ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News