Flipkart Moto G22: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటరోలా.. తన కొత్త స్మార్ట్ ఫోన్ Moto G22 ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాన్ని ఏప్రిల్ 13 నుంచి ప్రారంభిస్తున్నట్లు మోటరోలా సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ మొబైల్ ను చాలా తక్కువ ధరకే కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. దాదాపుగా రూ. 13,999 విలువైన స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ ద్వారా రూ. 549 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో తెలుసా?
Moto G22 ఆఫర్లు..
కొత్త మోటరోలా Moto G22 స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 8న ఆవిష్కరించగా.. దాన్ని ఏప్రిల్ 13న మార్కెట్లో విక్రయానికి ప్రవేశపెట్టారు. ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ వెబ్ సైట్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. Moto G22 స్మార్ట్ ఫోన్ మార్కెట్ ధర ప్రస్తుతం రూ. 13,999 ఉండగా.. దానిపై ఫ్లిప్ కార్ట్ సంస్థ 21 శాతం డిస్కౌంట్ తో రూ. 10,999 లకే అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై మీరు ICICI బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించడం వల్ల రూ. 1,000 వరకు తగ్గింపు పొందేందుకు అవకాశం ఉంది. దీంతో మోటీ జీ22 ధర రూ. 9,999 వద్దకు చేరుతుంది. దీంతో పాటు మోటో జీ22 స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ద్వారా మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవడం వల్ల మీరు అత్యధికంగా రూ. 10,450 వరకు ఆదా చేయవచ్చు.
అది మీ పాత ఫోన్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ఆఫర్ మొత్తాన్ని పొందేందుకు అర్హులైతే రూ. 10,999 ధర కలిగిన మోటో జీ22 స్మార్ట్ ఫోన్ ను రూ. 549 ధరకే కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ కొనుగోలుపై బ్యాంకు లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్లలో ఏదో ఒకటి మాత్రమే పొందవచ్చు.
Moto G22 ఫీచర్లు
డిస్ ప్లే - 6.5-అంగుళాల HD + IPS LCD
బ్యాటరీ బ్యాకప్ - 5,000 mAh (20 W టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్)
రిఫ్రెష్ రేట్ - 90 Hz
కెమెరా - 50 MP (మెయిన్ సెన్సార్), 8 MP (అల్ట్రా - వైడ్ లెన్స్), 2 MP (డెప్త్ సెన్సార్), 2 MP (మాక్రో లెన్స్) - 16 MP (ఫ్రంట్ కెమెరా)
ఆండ్రాయిడ్ మోడల్ - Android 12
ప్రాసెసర్ - MediaTek Helio G37
స్టోరేజ్ - 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్.
Also Read: Train Ticket Booking: రైలు ప్రయాణంలో లోయర్ బెర్తు బుక్ చేసుకోవాలంటే ఇలా చేయండి!
Also Read: Flipkart Sale: iPhone 13 Miniపై ఫ్లిప్ కార్ట్ భారీ తగ్గింపు.. ఆఫర్ ఇంకొక్క రోజు మాత్రమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook