Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్.. రూ.44వేల విలువ చేసే ఐఫోన్ కేవలం రూ.3725కే...

Flipkart Offer on iPhone: మీరు ఐఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా... బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ కోసం చూస్తున్నారా... అయితే ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో ఐఫోన్స్ అందుబాటులో ఉన్నాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 21, 2022, 03:48 PM IST
  • ఫ్లిప్‌కార్ట్ లేటెస్ట్ ఆఫర్స్
  • యాపిల్ ఐఫోన్ ఎస్ఈ (రెడ్ 128 జీబీ)పై బిగ్ డిస్కౌంట్ ఆఫర్
  • ఎక్స్‌చేంజ్‌లో ఈ ఐఫోన్‌ని కేవలం రూ.3725కే కొనుగోలు చేయవచ్చు
 Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్.. రూ.44వేల విలువ చేసే ఐఫోన్ కేవలం రూ.3725కే...

Flipkart Offer on iPhone: యాపిల్ బ్రాండ్ గురించి చెప్పేదేముంది.. యాపిల్ ఐఫోన్ చేతిలో ఉండటం చాలామంది ప్రెస్టేజ్‌గా ఫీలవుతారు. కొంతమందికి ఐఫోన్ వాడాలని ఉన్నా ధర కారణంగా కొనే సాహసం చేయరు. అయితే యాపిల్ బ్రాండ్‌లోనూ కొన్ని బడ్జెట్ ఫోన్స్ ఉన్నాయి. వాటిలో కొన్నింటిపై ప్రస్తుతం ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. రూ.44,290 విలువ చేసే యాపిల్ ఐఫోన్ ఎస్‌ఈ  (Red, 128 GB)ని ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్‌లో కేవలం రూ.3725కే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

20 శాతం డిస్కౌంట్ :

సాధారణంగా యాపిల్ ఐఫోన్ ఎస్ఈ (Red, 128 GB) ధర రూ.44,900. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై 20 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంటే.. డిస్కౌంట్ పోను ఈ ఐఫోన్‌ని రూ.35,499కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఐఫోన్ కొనుగోలుకు మీరు యాక్సిస్ బ్యాంక్ కార్డు వాడినట్లయితే 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. అంటే.. రూ.1774 మేర తగ్గింపు లభించినట్లే. అప్పుడు ఈ ఐఫోన్‌ను రూ.33,725కే కొనుగోలు చేయవచ్చు.

ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో కేవలం రూ.3725కే :

మీరు మీ పాత ఐఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసినట్లయితే యాపిల్ ఐఫోన్ ఎస్ఈ (Red, 128 GB)పై రూ.30 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. అంటే రూ.35,499 విలువ చేసే ఈ ఐఫోన్‌ని కేవలం రూ.5,499కే కొనుగోలు చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్ కార్డు ద్వారా క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా వర్తించినట్లయితే ఈ ఐఫోన్ మరింత చౌకగా రూ.3725కే లభిస్తుంది. ఇదే ఐఫోన్‌ని ఈఎంఐ పద్దతిలోనూ మీ సొంతం చేసుకోవచ్చు. నెలకు రూ.1214 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: Telangana Rains Alert: తెలంగాణలో 4 రోజులపాటు వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ

Also Read: Pawan Kalyan: బీజేపీతో పొత్తు లేనట్టేనా! జనసేన గెలిచే సీట్లు ఇవేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News