Flipkart Offer: రూ.74 వేలు విలువ చేసే ఐఫోన్ 12ని తక్కువ ధరకే కొనుగోలు చేసే ఛాన్స్.. ఆఫర్ రేపటితో లాస్ట్..

Flipkart Smart Phone Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్‌లో యాపిల్ ఐఫోన్‌ 12 మినీపై భారీ తగ్గింపుతో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 2, 2022, 12:19 PM IST
  • ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్
  • జూలై 1 నుంచి జూలై 3 వరకు
  • యాపిల్ ఐఫోన్ 12పై భారీ తగ్గింపు
Flipkart Offer: రూ.74 వేలు విలువ చేసే ఐఫోన్ 12ని తక్కువ ధరకే కొనుగోలు చేసే ఛాన్స్.. ఆఫర్ రేపటితో లాస్ట్..

Flipkart Smart Phone Offers: ప్రముఖ ఈకామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం బిగ్ బచత్ ధమాల్ సేల్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌లో చిన్న చిన్న కిచెన్ వస్తువులు మొదలు బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ల వరకు భారీ తగ్గింపుతో పొందవచ్చు. కొన్ని వస్తువులపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. స్మార్ట్ ఫోన్లపై ఎక్స్‌చేంజ్ ఆఫర్ రూపంలో భారీ తగ్గింపు లభిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ ఐఫోన్ 12 మినీ (పర్పుల్, 256 జీబీ)పై భారీ తగ్గింపుతో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను వినియోగించుకుంటే చౌక ధరలో ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు.

డిస్కౌంట్‌తో రూ.9901 ఆదా :

యాపిల్ ఐఫోన్ 12 మినీ (పర్పుల్, 256 జీబీ) సాధారణ ధర రూ.74,900. ఫ్లిప్‌కార్ట్‌లో దీనిపై 13 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంటే.. రూ.9901 వరకు ఆదా అవుతుంది. డిస్కౌంట్ పోను రూ.64,999కే ఐఫోన్ 12 మినీని మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ ఐఫోన్ కొనుగోలుకు మీరు యాక్సిస్ బ్యాంక్ కార్డు వాడినట్లయితే మరో 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంటే.. మరో రూ.3249 వరకు ఆదా అయినట్లే. అలా ఈ ఐఫోన్‌ని కేవలం రూ.61,750కే పొందవచ్చు.నెలకు రూ.2222 చెల్లించడం ద్వారా ఈఎంఐ పద్దతిలోనూ ఈ ఐఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు.

ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో భారీ తగ్గింపు :

యాపిల్ ఐఫోన్ 12 మినీ (పర్పుల్, 256 జీబీ)పై ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత స్మార్ట్ ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకున్నట్లయితే.. దాని కండిషన్‌ని బట్టి గరిష్ఠంగా రూ.12,500 వరకు తగ్గింపు లభిస్తుంది. ఒకవేళ పూర్తి ఆఫర్ వర్తించినట్లయితే రూ.64,999కి అందుబాటులో ఉన్న ఈ ఐఫోన్‌ని చౌకగా రూ.53,499కే కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, దీని కొనుగోలుకు యాక్సిస్ బ్యాంక్ కార్డు వాడి మరో 5 శాతం తగ్గి పొందినట్లయితే ధర మరింత తగ్గుతుంది. అప్పుడు మరింత చౌకగా రూ.50,250కే ఐఫోన్‌ని మీ సొంతం చేసుకోవచ్చు. అయితే ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కి షరతులు వర్తిస్తాయని గుర్తుంచుకోండి. ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. జూలై 1 నుంచి జూలై 3 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

Also Read: LIGER: నగ్నంగా షాకిచ్చిన విజయ్ దేవరకొండ

 

Also Read:ENG vs IND: ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టిన సామ్‌ బిల్లింగ్స్‌.. వీడియో చూస్తే బిత్తరపోవాల్సిందే

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News