Flight Tickets: భారీగా పెరిగిన విమానయాన ధరలు, ఢిల్లీ నుంచి హైదరాబాద్ టికెట్ 40 వేలు

Flight Tickets: దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయం గత కొద్దిరోజులుగా కిటకిటలాడిపోతోంది. అసలిది విమానాశ్రయమేనా అనే సందేహం వచ్చేలా ఉంది. అదే సమయంలో ఢిల్లీ నుంచి దేశంలోని పలు నగరాలకు విమాన ఛార్జీలు కూడా అమాంతం పెరిగిపోయాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 14, 2022, 06:44 PM IST
Flight Tickets: భారీగా పెరిగిన విమానయాన ధరలు, ఢిల్లీ నుంచి హైదరాబాద్ టికెట్ 40 వేలు

దేశంలో గత కొద్దిరోజులుగా అన్ని విమానాశ్రయాలు రద్దీగా నడుస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ విమానాశ్రయం పరిస్థితి మరింత దారుణంగా మారింది. ప్రయాణీకుల డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు విమానయాన సంస్థలు అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇవాళ్టి రేట్లను పరిశీలిస్తే..ఆశ్చర్యపోవల్సిందే.

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కసారిగా ప్రయాణీకులతో పోటెత్తుతోంది. ఎంతలా ఉంటే బోర్డింగ్ ఆలస్యమై..విమానాలు ఆలస్యంగా తిరుగుతున్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో నెలకొన్న రద్దీ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు. మరోవైపు డిమాండ్ ఎక్కువకావడంతో విమాన ఛార్జీలు కూడా ఆకాశాన్నంటేస్తున్నాయి. 

ఢిల్లీ నుంచి హైదరాబాద్ టికెట్ 40 వేలు
ఢిల్లీ నుంచి బెంగళూరు టికెట్  32 వేలు
ఢిల్లీ నుంచి చెన్నై టికెట్  21 వేలు

ఢిల్లీ నుంచి చెన్నైకు నాన్‌స్టాప్ ఇండిగో ఎయిర్‌లైన్స్ టికెట్ 21 వేలు పలుకుతుంటే..విస్తారా ఎయిర్‌లైన్స్ టికెట్ 17 వేలుగా ఉంది. ఇక ఢిల్లీ నుంచి హైదరాబాద్ ధరలు మరీ దారుణంగా ఉన్నాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్ సింగిల్ స్టాప్ ధర 22 వేలు కాగా, మరో సర్వీస్ సింగిల్ స్టాప్ 30 వేలు కూడా ఉంది. బెంగళూరు మీదుగా విస్తారా ఎయిర్‌లైన్స్ టికెట్ ధర అయితే గూబ గుయ్యిమన్పిస్తోంది. ఏకంగా 38 వేలుంది. 

ఇక ఢిల్లీ నుంచి బెంగళూరుకు ఆకాశ్ ఎయిర్‌లైన్స్ టికెట్ 20 వేలు కాగా, ఎయిర్ ఇండియా టికెట్ ధర 32 వేలుంది. ఈ ధరలు కూడా బోర్డింగ్ ఛార్జిలు, జీఎస్టీ కాకుండానే. ఒక్కసారిగా డిమాండ్ రావడంతో ..దొరికిందే సందుగా ప్రయాణీకుల్నించి గుంజేస్తున్నాయి విమానయాన సంస్థలు. సాధారణ సమయంలో ఈ గమ్యస్థానాలకు టికెట్ ధర కేవలం 5-10 వేలు మధ్యలోనే ఉంటుంది. 

Also read: Supreme Court: ఉమ్మడి ఆస్థుల పంచాయితీ ఇక సుప్రీంకోర్టులో, పిటీషన్ దాఖలు చేసిన ఏపీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News