Excitel Broadband offers: జియో, ఎయిర్‌టెల్‌కు చెమటలు పట్టిస్తున్న ఎక్సీటెల్, తక్కువ ధరకే హైస్పీడ్ ఇంటర్నెట్, ఓటీటీ సేవలు

Excitel Broadband offers: హై స్పీడ్ ఇంటర్నెట్, తక్కువ ఖర్చు, ఓటీటీ సేవలు ఉన్నాయంటే ఎవరు కాదంటారు. అందుకే ఆ కంపెనీ బ్రాడ్‌బ్యాండ్ సేవలు ఎయిర్‌టెల్, జియోలకు చెమటలు పట్టిస్తున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 21, 2022, 05:51 PM IST
Excitel Broadband offers: జియో, ఎయిర్‌టెల్‌కు చెమటలు పట్టిస్తున్న ఎక్సీటెల్, తక్కువ ధరకే హైస్పీడ్ ఇంటర్నెట్, ఓటీటీ సేవలు

Excitel Broadband offers: హై స్పీడ్ ఇంటర్నెట్, తక్కువ ఖర్చు, ఓటీటీ సేవలు ఉన్నాయంటే ఎవరు కాదంటారు. అందుకే ఆ కంపెనీ బ్రాడ్‌బ్యాండ్ సేవలు ఎయిర్‌టెల్, జియోలకు చెమటలు పట్టిస్తున్నాయి.

ఇంటర్నెట్ అనేది ప్రస్తుతం సర్వ సాధారణంగా మారిపోతోంది. స్మార్ట్‌ఫోన్లలో మొబైల్ డేటా ఎలానూ ఉంటుది. కానీ ఇంట్లో బ్రాడ్‌బ్యాండ్ లేదా వైఫై వినియోగం కూడా పెరుగుతోంది. మీ ఇంట్లో కూడా బ్రాడ్‌బ్యాండ్ వినియోగిస్తుంటే..ఈ ఆఫర్ మీ కోసమే. తక్కువ ఖర్చుతో, హై స్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు ఓటీటీ సేవలు అందించే ఆఫర్ ఇది. ఈ ప్లాన్ ముందు జియో, ఎయిర్‌టెల్ కంపెనీల ప్లాన్స్ నీరుగారిపోతున్నాయి.

తక్కువ ఖర్చుతో, ఓటీటీ సేవలు, హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తున్నది జియో లేదా ఎయిర్‌టెల్ కానేకాదు. ఎక్సీటెల్ కంపెనీ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఆఫర్ ఇది. ఎక్సీటెల్ కంపెనీ ఫెస్టివ్ ఆఫర్‌లో భాగంగా ఆకర్షణీయమైన ప్లాన్ అందిస్తోంది. ఇందులో హై స్పీడ్ ఇంటర్నెట్, ఇతర ప్రయోజనాలు చాలా కలగనున్నాయి. 

అత్యంత చౌకగా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

ఎక్సీటెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర 530 రూపాయల్నించి ప్రారంభం కానుంది. తొలి ప్లాన్ వ్యాలిడిటీ 3 నెలలుంటుంది. ఆరు నెలల ప్లాన్ ధర 564 రూపాయలు కాగా, 635 రూపాయల్లో 9 నెలల ప్లాన్ అందుబాటులో ఉంది. ఏడాది వ్యవధికి తీసుకుంటే 667 రూపాయలు చాలు. ఈ అన్ని ప్లాన్స్‌లో 300 ఎంబీపీఎస్ స్పీడ్ లభిస్తుంది. 

ఈ ప్లాన్స్‌లో 300 ఎంబీపీఎస్ స్పీడ్ లభిస్తుంది. అంతేకాకుండా..ఓటీటీ ప్రయోజనాలు కూడా అందిస్తుంది. ఈ ప్లాన్స్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అదే సమయంలో సోనీ లివ్, జీ5, వూట్ సెలెక్ట్,ప్లేబాక్స్ టీవీ వంటి ఇతర ఛానెల్స్ కోసం కనీస ఛార్జ్ చెల్లించాలి. ఎక్సిటెల్ ఓటీటీ స్టాండర్డ్ ప్లాన్ 100 రూపాయలకు తీసుకోవచ్చు. 200 రూపాయలకు ఎక్సిటెల్ ప్రీమియం ప్లాన్ లభిస్తుంది. 

Also read: Multibagger Stock: 15 ఏళ్ల క్రితం 3 వందలున్నషేరు, ఇప్పుడు 50 వేలు, ఎన్ని రెట్ల లాభమో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok

Trending News