PF Balance: పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునేందుకు నాలుగు విధానాలివే

PF Balance: పీఎఫ్ ఎక్కౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సులభం. ఇంట్లో కూర్చుని నాలుగు రకాలుగా పీఎఫ్ ఎక్కౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఆ నాలుగు విధానాలేంటో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 3, 2022, 09:39 PM IST
 PF Balance: పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునేందుకు నాలుగు విధానాలివే

PF Balance: పీఎఫ్ ఎక్కౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సులభం. ఇంట్లో కూర్చుని నాలుగు రకాలుగా పీఎఫ్ ఎక్కౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఆ నాలుగు విధానాలేంటో తెలుసుకుందాం..

ప్రభుత్వ, ప్రైవేటు సేవలన్నీ ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే లభిస్తున్న పరిస్థితి. ఈపీఎఫ్ఓ కూడా ఇప్పుడు దాదాపు అన్ని సేవల్ని ఆన్‌లైన్‌లోనే అందిస్తోంది. పీఎఫ్ ఖాతాదారుడు తమ ఎక్కౌంట్ చూసుకోవడం కూడా సులభమైపోయింది. పీఎఫ్‌కు సంబంధించిన అన్ని విషయాల్ని ఆన్‌లైన్ ద్వారానే తెలుసుకునే వీలుంది ఇప్పుడు. 

పీఎఫ్ ఎక్కౌంట్ బ్యాలెన్స్ తెలుసుకునేందుకు నాలుగు విధానాలున్నాయి. రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ద్వారా, రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి ఎస్ఎంఎస్ ద్వారా ఆన్‌లైన్ ఉమంగ్ యాప్ ద్వారా, ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ లాగిన్ ద్వారా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. 

మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోవాలంటే ఆ నెంబర్ మీ పీఎఫ్ ఎక్కౌంట్‌తో రిజిస్టర్ అయుండాలి. మిస్డ్ కాల్ ద్వారా బ్యాలెన్స్ తెలుసుకునేందుకు 011-22901406 పై మిస్డ్ కాల్ చేయాల్సి ఉంటుంది. కాల్ చేసిన కాస్సేపటికి ఎస్ఎంఎస్ ద్వారా మీ బ్యాలెన్స్ వస్తుంది. 

ఎస్ఎంఎస్ నుంచి పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునేందుకు ఈపీఎఫ్ఓ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి 7738299899 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపించాలి. EPFO UAN LAN అని టైప్ చేసి పంపించాలి. చివర LAN స్థానంలో మీ భాష మొదటి మూడక్షరాలు టైప్ చేయాలి. మెస్సేజ్ చేసిన కాస్సేపటికే మీ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. 

ఇక ఉమంగ్ యాప్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ ఎక్కౌంట్ చెక్ చేసుకోవచ్చు. మీ స్మార్ట్ ఫోన్‌లో ఉమంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఉమంగ్ యాప్‌లో ఈపీఎఫ్ఓ‌పై క్లిక్ చేయాలి. ఇందులో Employee Centric Services క్లిక్ చేయాలి. ఆ తరువాత వ్యూ పాస్‌బుక్ క్లిక్ చేసి మీ యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి పంపిస్తే..మీ బ్యాలెన్స్ తెలిసిపోతుంది.

ఇక వెబ్‌సైట్ ద్వారా పీఎఫ్ ఎక్కౌంట్ బ్యాలెన్స్ తెలుసుకునేందుకు ఈపీఎఫ్ పాస్‌బుక్ పోర్టల్ సంప్రదించాలి. ఈ పోర్టల్‌పై మీ యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. అందులో వ్యూ పాస్‌వర్డ్ క్లిక్ చేయాలి. స్క్రీన్‌పై పాస్‌బుక్ ఓపెన్ అయి..మీ బ్యాలెన్స్ కన్పిస్తుంది. 

Also read: OPEC Decision: త్వరలో మరింత తగ్గనున్న పెట్రోల్-డీజిల్ ధరలు, ఎందుకంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News