పీఎఫ్ అనేది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగికి చాలా ముఖ్యమైంది. పీఎఫ్ ఎక్కౌంట్ విషయంలో ఎన్నో సందేహాలు వస్తుంటాయి. ముఖ్యంగా ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకు మారినప్పుడు పాత కంపెనీ పీఎఫ్‌ను ఎలా బదిలీ చేసుకోవాలనేది సర్వత్రా ఎదురయ్యే ప్రశ్న.
అందుకే ఈపీఎఫ్ఓ కార్యాలయం కీలకమైన సమాచారం వెలువరించింది. దీని ప్రకారం ఇక క్షణాల్లోనే మీరు పాత పీఎఫ్‌ను బదిలీ చేసుకోవచ్చు. మీరు ఉద్యోగ నిమిత్తం ఎన్ని కంపెనీలు మారినా..పాత కంపెనీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను ప్రస్తుత కంపెనీకు మార్చుకోవచ్చు.
అయితే మీ పాత కంపెనీ పీఎఫ్‌ను మరో కంపెనీ పీఎఫ్‌కు మార్చేందుకు యాక్టివ్ యూఎన్ నెంబర్, పాస్వర్డ్ కచ్చితంగా ఉండాలి. అది కాకుండా మీ యూఏఎన్ నెంబర్లో బ్యాంక్ ఎక్కౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ వంటి వివరాలన్నీ అప్డేట్ కావల్సి ఉంటుంది.
పాత పీఎఫ్ ఎక్కౌంట్ నుంచి కొత్త ఎక్కౌంట్‌కు ఎలా మార్చడం
పీఎఫ్ బదిలీ చేయాలంటే..ఎంట్రీ, ఎగ్జిట్ డేట్ అప్డేట్ కావాలి. వ్యూ ఆప్షన్ క్లిక్ చేసి..సర్వీస్ హిస్టరీ ఆప్షన్లో వెళ్లాలి. మీ పాత కంపెనీ రెండు తేదీల్ని అప్డేట్ చేసుంటే..మీ పీఎఫ్ సులభంగా బదిలీ అవుతుంది. మీరు ఆన్లైన్ సర్వీసెస్‌లో వెళ్లి..ONE MEMBER ONE EPF ACCOUNT క్లిక్ చేయాలి. ఇప్పుుడు మీ ముందు ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ వ్యక్తిగత సమాచారముంటుంది. ఇది కాకుండా..ప్రస్తుత కంపెనీ పీఎఫ్ ఎక్కౌంట్ వివరాలుంటాయి. ఇందులో మీ పాత పీఎఫ్ డబ్బుల వివరాలతో పాటు పాత ఎంప్లాయర్ వివరాలుంటాయి. ఇక్కడ పీఎఫ్ బదిలీ చేసుకునేవాళ్లు ప్రస్తుత కంపెనీ లేదా పాత ఎంప్లాయర్ నుంచి అప్రూవ్ తీసుకోవాలి. ఆ తరువాత యూఏఎన్ వివరాలు ఎంటర్ చేయాలి. ఇలా చేయగానే..గతంలో చేసిన అన్ని కంపెనీల పీఎఫ్ ఐడీలు కన్పిస్తాయి. ఏ డబ్బులు బదిలీ చేయాలో..దాన్ని సెలెక్ట్ చేయాలి. తరువాత ఓటీపీ ద్వారా నిర్ధారించుకుంటే చాలు..మీ బదిలీ ప్రక్రియ పూర్తవుతుంది. అన్ని వివరాలు సిద్ధంగా ఉంటే క్షణాల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.
Also read: Iqoo Smartphone: శాంసంగ్, వన్‌ప్లస్‌లకు పోటీగా..అత్యంత చౌక ధరలో మరో 5 జి స్మార్ట్‌ఫోన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook