Earn money ideas: మీరు లక్షాధికారి అయ్యే అవకాశాలున్నాయి. ఒకవేళ మీ వద్ద ఆ కాయిన్ ఉంటే. అలాగని ఆ కాయిన్ తీసుకుని ఎక్కడికీ వెళ్లనక్కర్లేదు. ఇంట్లో కూర్చునే లక్షలు సంపాదించవచ్చు.
ఇంట్లో కూర్చునే డబ్బులు సంపాదించాలంటే ఇంతకంటే మరో మార్గం లేదు. కానీ మీ వద్ద ఆ కాయిన్ ఉండాలి. ఎందుకంటే మంచి అవకాశం ఇది. కేవలం 2 రూపాయల కాయిన్‌తో 5 లక్షల వరకూ సంపాదించవచ్చు. ఎక్కడికీ వెళ్లకుండానే..ఇంట్లోంచి కదలకుండానే సంపాదించుకోవచ్చు.
పాత కాయిన్లు లేదా పాత నోట్లకు బదులుగా లక్షలు సంపాదించుకునే అవకాశాల గురించి వినే ఉంటారు. అసలు వీటిని ఎవరు కొనుగోలు చేస్తారని ఎప్పుడైనా ఆలోచించారా..యాంటిక్ వస్తువులు లేదా కాయిన్లు లేదా నోట్లు సేకరించేవారికి ఇలాంటి అవకాశాలు డబ్బులు కురిపిస్తాయి. అదే విధంగా యాంటిక్ వస్తువులపై ఆసక్తి ఉన్నవాళ్లు డబ్బులకు వెనుకాడరు. మీ వద్ద కూడా పాత కాయిన్లు ఉంటే లక్షలు సంపాదించవచ్చు.
ఒకవేళ మీ వద్ద 1994, 1995, 1997 లేదా 2000 సిరీస్‌లో ముద్రితమైన 2 రూపాయల కాయిన్ ఉంటే వెంటనే 5 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఈ కాయిన్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ కాయిన్ల కోసం లక్షలిచ్చేందుకు సిద్ధమౌతున్నారు. ఆ విధానమేంటో చూద్దాం..
మీ వద్ద 2 రూపాయల కాయిన్ ఉంటే క్వికర్ ఆన్లైన్ వేదికపై అమ్ముకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌పై అరుదైన ఆ నాణేనికి భారీగా విలువ కడుతున్నారు. 2 రూపాయల నాణేన్ని అమ్మేందుకు ముందుగా మీరు క్వికర్పై ఒక సెల్లర్లా మీ పేరు నమోదు చేసుకోవాలి. ఆ తరువాత మీ వద్ద ఉన్న కాయిన్ ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. తరువాత మీ మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి. వెబ్సైట్లో మీరిచ్చిన సమాచారాన్ని వెరిఫై చేయాలి.
ఈ వెబ్సైట్లో రెండు ఆప్షన్లు ఉన్నాయి. కాయిన్ కొనుగోలు చేసేందుకు బై నౌ, అమ్మేందుకు మేక్ ఎ ఆఫర్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. కాయిన్ ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. ఆ తరువాత బయ్యర్లు నేరుగా మీతోనే సంప్రదిస్తారు. కాయిన్‌కు ఎంత డబ్బు లభిస్తుందనేది యాంటిక్ కాయిన్లు సేకరించేవారి అభిరుచిపై ఆదారపడి ఉంటుంది.
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook