Dish TV complaint against Yes Bank with SEBI: డిష్ టీవీ, యస్ బ్యాంకుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తారా స్థాయికి చేరింది. డిష్ టీవీ యాజమాన్యంపై యస్ బ్యాంకు చేస్తోన్న కుట్రలపై తాజాగా ఆ సంస్థ స్టాక్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు (Dish TV to SEBI) ఫిర్యాదు చేసింది. తమ కంపెనీని అక్రమ మార్గంలో చేజిక్కించుకునేందుకు యస్ బ్యాంకు కుట్ర పన్నుతోందని సెబీకి ఇచ్చిన ఫిర్యాదులో డిష్ టీవీ పేర్కొంది.
జవహార్ గోయల్ (Jawahar Goyal) సారథ్యంలోని డిష్ టీవీ కంపెనీలోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ని తొలగించాల్సిందిగా కంపెనీని కోరిన యస్ బ్యాంక్.. తాము నామినేట్ చేసిన వ్యక్తులను ఆ స్థానంలో నియమించాల్సిందిగా స్పష్టంచేసింది. తద్వారా తమ కంపెనీపై పట్టు సాధించి సంస్థను హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నుతోందని డిష్ టీవీ ఆరోపించింది. ఎక్విజిషన్ కోసం ఓపెన్ ఆఫర్ ఇవ్వకుండానే యస్ బ్యాంకు కుట్రలకు తెరలేపిందని డిష్ టీవీ స్టాక్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) దృష్టికి తీసుకొచ్చింది.
Also read : Gold Price Today: దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇలా
Yes Bank conspiracy against Dish Tv - డిష్ టీవీపై కన్నేసిన యస్ బ్యాంకు:
డిష్ టీవీ కంపెనీపై కన్నేసిన యస్ బ్యాంకు.. ఎలాగైనా సరే సంస్థను చేజిక్కించుకోవాలని శతవిధాల ప్రయత్నిస్తోందని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. తాజాగా డిష్ టీవీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ని తొలగించాల్సిందిగా కంపెనీపై ఒత్తిడి తీసుకొస్తున్న వైనం మరోసారి యస్ బ్యాంకు కుట్రపూరిత వైఖరికి అద్దంపడుతోంది. అయితే, డిష్ టీవీపై కన్నేసి, సంస్థను సొంతం చేసుకోవాలని భావిస్తున్న యస్ బ్యాంకు.. ఆ దిశగా డిష్ టీవీకి ఓపెన్ ఆఫర్ ఎందుకు ఇవ్వడం లేదనేదే ఇక్కడ ఎవ్వరికీ అర్థం కాని ప్రశ్న.
YES bank stake in Dish Tv - డిష్ టీవీలో యస్ బ్యాంకులు వాటా:
ఐడిబిఐ ట్రస్టీషిప్ సర్వీసెస్‌తో కలిసి యస్ బ్యాంకుకు డిష్ టీవీలో 25.63 శాతం వాటాలు ఉన్నాయి. 2020 మే 29వ తేదీ నుంచి 2020 జులై 9 మధ్య కాలంలో మొత్తం మూడు విడతల్లో డిష్ టీవీ కంపెనీ షేర్లను యస్ బ్యాంకు దక్కించుకుంది. అయితే, డిష్ టీవీని తమ చేతుల్లోకి తీసుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తోన్న యస్ బ్యాంకు.. డిష్ టీవీ కంపెనీకి బహిరంగంగా టేకోవర్ ఆఫర్ ఎందుకు ఇవ్వడం లేదనేదే ఇక్కడ అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఇదే విషయమై యస్ బ్యాంకు వైఖరిని నిలదీస్తూ సెబీకి తాజాగా డిష్ టీవీ (Dish TV vs Yes Bank) ఓ లేఖ రాసింది. ఆ ఫిర్యాదు లేఖలో ఈ వివరాలన్నీ పేర్కొంది.
Also read : Crazy Offer: రూ.20,990 ధర గల 5G స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 2,000కే.. త్వరపడండి!
Also read : PNB Bank offers : పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులకు బంఫర్ ఆఫర్.. 2 లక్షల వరకు ప్రయోజనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook