Santhosh policy: నెలకు రూ.1300 చెల్లించి, రూ.13 లక్షలు పొందే అద్భుత పాలసీ

మన పోస్ట్ ఆఫీసుల్లో చాలా రకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. మీరు తప్పక తెలిసుకోవాల్సిన మరో లాభదాయకమైన పాలసీ "సంతోష్". తక్కువ మొత్తం చెల్లించి ఎక్కువ మొత్తం లాభం పొందే ఈ పాలసీ గురించి తెలుసుకోండి  

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 25, 2021, 01:42 PM IST
  • తక్కువ మొత్తం చెల్లించి ఎక్కువ మొత్తం లాభం పొందే బీమా పాలసీ
  • ప్రతి నెల రూ.1300 చెల్లించి, రూ.13 లక్షలు పొందండి
  • భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసే వారికి ఇది లాభదాయకం
  • మరో లాభం ఏంటంటే ఈ పాలసీ ద్వారా బోనస్ కూడా పొందవచ్చు
Santhosh policy: నెలకు రూ.1300 చెల్లించి, రూ.13 లక్షలు పొందే అద్భుత పాలసీ

భవిష్యత్తు అవసరాల కోసం డబ్బు పొదుపు అనేది అందరకి అవసరమే. భవిష్యత్తులో ఆపద సమయంలో పొదుపు చేసిన డబ్బులు మన అవసరాలను తీరుస్తాయి. చాలా రకాల బీమా పాలసీలు ఉన్నప్పటికీ పోస్ట్ ఆఫీస్ (Post Office)లో ఉండే బీమా పాలసీలు మరియు లాభదాయకమైన స్కీములు అందుబాటులో ఉన్నాయి

నెలకు కేవలం రూ.1300 కడితే చాలు రూ.13 లక్షలు పొందే అవకాశం ఉంది. ఈ రోజు ఆ బీమా పథకం గురించి తెలుసుకుందాం. 

Also Read:  TS EAMCET 2021 results: విడుదలైన తెలంగాణ ఎంసెట్ 2021 ఫలితాలు...

పోస్ట్ ఆఫీస్ (Post Office)లో అందుబాటులో ఉన్న ఈ బీమా పేరు "గ్రామ సంతోష్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీ" (Grama Santosh Rural Postal Life Insurance Scheme) లేదా "సంతోష్ పాలసీ" (Santhosh Postal Life Insurance) అని పిలుస్తారు ... ఈ పాలసీ కింద బోనస్ తో పాటు బీమా మొత్తం మెచ్యూరిటీపై కూడా లభిస్తుంది. తక్కువ మొత్తంలో చెల్లించి ఎక్కువ మెచ్యూరిటీని పొందలకునే వారికి ఈ పాలసీ లాభదాయకం అనే చెప్పాలి. 

కానీ ఈ పాలసీ అందరికి కాకుండా కొంత మందికే మాత్రమే వర్తిస్తుంది... వారేవరంటే మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌లు (management consultant), న్యాయవాదులు (laywer), బ్యాంకర్లు (Bankers), ప్రభుత్వ ఉద్యోగులు , సెమీ ప్రభుత్వ ఉద్యోగులు,  CA లకు ఈ పాలసీ వర్తిస్తుంది.  అంతేకాకుండా, ప్రభుత్వం గుర్తించిన విద్యాసంస్థల్లో పనిచేసే వారికి, NSE లేదా BSE లో జాబితా చేర్చబడిన కంపెనీలలో పనిచేసే వారికి "సంతోష్" పాలసీ వర్తిస్తుంది. 

సంతోష్ పాలసీ వివరాలు...
19 సంవత్సరాల పై బడిన వారికి మాత్రమే సంతోష్ పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, గరిష్ట వయోపరిమితి 55 సంవత్సరాలు మాత్రమే. ఇటు 19 సంవత్సరాలు నిండని వారు, అటు 55 సంవత్సరాలు పైబడిన వారు ఈ పాలసీకి అర్హులు కాదనే చెప్పాలి. 

సంతోష్ పాలసీ  పాలసీలో మరో లాభదాయకమైన విషయం ఏమిటంటే... ఏ వయసులో అయిన మెచ్యూరిటీ మొత్తాన్ని తీసుకోవచ్చు. ఇది రెగ్యులర్ పాలసీ (Regular Policy) కారణంగా అమలులో ఉన్న సంవత్సరాలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 

Also Read: Corona update: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు...ఒక్క కేరళలోనే 24 వేలకుపైగా..

ఉదాహరణకు.. ఈ పాలసీ ద్వారా కనీస హామీ మొత్తం రూ .20,000 నుండి గరిష్టంగా రూ .50 లక్షల వరకు బీమా పొందవచ్చు. ప్రీమియం ప్రతి నెలతో పాటు, మూడు నెలలు, ఆరు నెలలు లేదా సంవత్సరానికి ఒకసారి చెల్లించే అవకాశం కూడా ఈ పాలసీలో ఉండటం విశేషం. 

ఎంత మొత్తం చెల్లించాలి??
ఇపుడు ఒక వ్యక్తి వయసు 30 సంవత్సరాలు.. అతను 5 లక్షల రూపాయల పాలసీని  60 సంవత్సరాల పాటు కట్టడానికి నిర్ణయించుకున్నాడు. దీని ప్రకారం అతను 30 సంవత్సరాల వయసులో పాలసీ ఎంపిక చేసుకున్న కారణంగా 30 సంవత్సరాల కాల వ్యవధి పాటు ఈ పాలసీ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అతను ఎంచుకున్న పాలసీ ప్రకారం నెలకు రూ. 1332 చెల్లించాల్సి వస్తుంది. ఇదే పాలసీని వార్షిక ప్రీమియంగా (Yearly scheme) ఎంచుకుంటే రూ .15,508 చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: Hardik Pandya: హార్ధిక్ పాండ్యా 'వాచ్' రేటు ఎంతో తెలిస్తే.. మైండ్ బ్లాంక్ అయిపోద్ది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News