Best Smartphones Under Rs. 10,000: రూ. 10 వేల కంటే తక్కువ ధరలో వచ్చే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

Best Smartphones Under Rs. 10,000: తక్కువ బడ్జెట్లో మంచి స్మార్ట్ ఫోన్ కొనడం అనేది కత్తి మీద సాములాంటిది. ఎందుకంటే ధర తగ్గే కొద్దీ ఫీచర్స్ కూడా అదేస్థాయిలో తగ్గుతుంటాయి. మిడ్ లెవెల్ సెగ్మెంట్, ప్రీమియం సెగ్మెంట్ ఫోన్లలో ఉండే బెస్ట్ ఫీచర్స్ ఈ బడ్జెట్ ఫోన్లలో ఉండే అవకాశాలు చాలా తక్కువ. అందుకే తక్కువ ధరలో బెస్ట్ ఫోన్ కొనుగోలు చేయాలంటే మార్కెట్లో ఉన్న ఎంట్రీ లెవెల్ ఫోన్లపై ఎంతో స్టడీ చేయాల్సి ఉంటుంది. 

Written by - Pavan | Last Updated : Jul 10, 2023, 12:42 PM IST
Best Smartphones Under Rs. 10,000: రూ. 10 వేల కంటే తక్కువ ధరలో వచ్చే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

Best Smartphones Under Rs. 10,000: తక్కువ బడ్జెట్లో మంచి స్మార్ట్ ఫోన్ కొనడం అనేది కత్తి మీద సాములాంటిది. ఎందుకంటే ధర తగ్గే కొద్దీ ఫీచర్స్ కూడా అదేస్థాయిలో తగ్గుతుంటాయి. మిడ్ లెవెల్ సెగ్మెంట్, ప్రీమియం సెగ్మెంట్ ఫోన్లలో ఉండే బెస్ట్ ఫీచర్స్ ఈ బడ్జెట్ ఫోన్లలో ఉండే అవకాశాలు చాలా తక్కువ. అందుకే తక్కువ ధరలో బెస్ట్ ఫోన్ కొనుగోలు చేయాలంటే మార్కెట్లో ఉన్న ఎంట్రీ లెవెల్ ఫోన్లపై ఎంతో స్టడీ చేయాల్సి ఉంటుంది. ముందుగా తక్కువ ధరలో లభించే ఫోన్ల జాబితాను సేకరించాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆయా ఫోన్ల ధర, ఫీచర్స్, కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే.. ఇలా అన్ని అంశాల్లోనూ ఒక ఫోన్‌తో మరొక ఫోన్‌ని పోల్చి చూడాల్సి ఉంటుంది. కానీ మీకు అలాంటి శ్రమ ఏదీ లేకుండానే మీ ముందుకు రూ. 10 వేల లోపు వచ్చే బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల వివరాలను ఇక్కడ అందిస్తున్నాం. 

పోకో C51
రూ. 10 వేల లోపు తక్కువ ధర కలిగిన ఫోన్లలో మరీ చౌకయిన ఫోన్ పోకో C51. ఈ జాబితాలో ఇదే అత్యంత చౌకయిన ఫోన్. ఈ ఫోన్ ధర కేవలం రూ. 6,999. 4GB RAM , 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తోన్న ఈ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీని అమర్చారు. మీడియాటెక్ హీలియో G36 ప్రాసెసర్ తో నడిచే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ద్వారా రన్ అవుతుంది. సాధారణ వినియోగం కోసమైతే.. ఒక్కసారి చార్జ్ చేస్తే నిశ్చింతగా రెండు రోజులు ఈ ఫోన్ ని ఉపయోగించుకోవచ్చు.

రియల్‌మి నార్జో N53
రియల్‌మి నార్జో N53 ఒక ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్. 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫోన్ గేమింగ్ కోసం డిజైన్ చేసింది కానప్పటికీ.., యూనిసాక్ T612 SoC సహాయంతో యాప్స్, సాఫ్ట్‌వేర్ ఇంటర్‌ఫేస్‌ హ్యాంగ్ అవకుండా రన్ అవుతుంది. 5,000mAh బ్యాటరీతో పాటు మంచి కెమెరా, ఫాస్ట్ చార్జింగ్ కోసం 33W ఫాస్ట్ ఛార్జర్‌ వంటి ఫీచర్స్ తో లభిస్తోంది. ఈ ఫోన్ ఖరీదు రూ. 8,999 మాత్రమే.

లావా యువ 2 ప్రో
లావా యువ 2 ప్రో లుక్ విషయానికొస్తే.. రియల్‌మి నార్జో N53 తరహాలో కనిపిస్తుంది. అలాగే ఐఫోన్ ని పోలిన కెమెరా మాడ్యూల్‌ సెట్టింగ్ ఐఫోన్ ని తలపిస్తుంది. వెనుక భాగంలో గ్లాస్ ప్యానెల్ ఉంది. 6.5 అంగుళాల HD+ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్‌తో వస్తోన్న పెద్ద ఫోన్ ఇది. మీడియాటెక్ హీలియో G37 SoC తో వచ్చే ఈ ఫోన్ బేసిక్, రొటీన్ అవసరాలకు సరిగ్గా సరిపోతుంది. గేమింగ్ కోసం డిజైన్ చేసిన ఫోన్ కాదు. ప్రైవసీ లాక్ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ లభిస్తుంది. కెమెరా పని తీరు యావరేజ్. బ్యాటరీ పరంగా స్ట్రాంగ్ ఫోన్ అనుకోవచ్చు. సాధారణ అవసరాల కోసం ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే.. కనీసం రెండు రోజులు పాటు ఫోన్ ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్ ధర రూ. 7,999 గా ఉంది. 

రియల్‌మి C55
రియల్‌మి C55 ఫోన్ ఇదే జాబితాలో ఉన్న నార్జో N53 ఫోన్ కంటే నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లడానికి సహాయపడుతుంది. రియల్‌మి C55 డిజైన్ విషయానికొస్తే.. యాపిల్ ఐఫోన్ 14 ప్రో డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ను అనుకరించే ప్రయత్నం చేసిన ఏకైక ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌గా చెబుతుంటారు. మీడియాటెక్ హీలియో G88 SoC, 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, ప్రీమియం లుకింగ్ ఉన్న డిజైన్ ఉన్న ఈ ఫోన్ ధర రూ. 10,999 గా ఉంది.

ఇది కూడా చదవండి : Samsung Galaxy M34 5G: తక్కువ ధరలోనే మిడ్‌లెవెల్ సెగ్మెంట్ ఫీచర్స్ ఉన్న ఫోన్

మోటో E13
మోటో E13 ఫోన్ ఆండ్రాయిడ్ 13 తో రన్ అవుతుంది. బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ జాబితాలో డెడ్ చీప్ ధరలో లభించే స్మార్ట్‌ఫోన్స్‌లో ఇది కూడా ఒకటి. ఈ ఫోన్ ధర రూ. 6,799 మాత్రమే. 2GB RAM , 4GB RAM వేరియంట్స్‌లో లభిస్తుంది. మార్కెట్లోకి ఎప్పటికప్పుడు వస్తోన్న కొత్తకొత్త స్మార్ట్‌ఫోన్స్ అప్‌డేట్స్ కోసం కీప్ వాచింగ్ దిస్ స్పేస్.

ఇది కూడా చదవండి : Oneplus Nord 3 5G, Oneplus Nord CE 3 5G: వన్‌ప్లస్ నుంచి మరో రెండు సూపర్ స్మార్ట్‌‌ఫోన్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News