Cheap And Best Cars: ఫస్ట్ టైమ్ కారు కొంటున్నారా ? టెన్షన్ వద్దు.. ఇదిగో లిస్ట్

Cheap And Best Cars For First Time Buyers in India: ఫస్ట్ టైమ్ కారు కొనే వారికి ఎలాంటి తికమక లేకుండా సరసమైన ధరలో ఎక్కువ కాలం మన్నిక ఇచ్చే కార్లు, ఈజీగా ఉపయోగించేందుకు ఆస్కారం ఉండే కార్లు, ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల జాబితాను సిద్ధం చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఫస్ట్ టైమ్ బయ్యర్స్ కనుక భారీ ఎస్‌యూవీలు కాకుండా హ్యాచ్ బ్యాక్ కార్లతో ఈ జాబితాను సిద్ధం చేశాం.

Written by - Pavan | Last Updated : Jul 27, 2023, 01:54 PM IST
Cheap And Best Cars: ఫస్ట్ టైమ్ కారు కొంటున్నారా ? టెన్షన్ వద్దు.. ఇదిగో లిస్ట్

Cheap And Best Cars For First Time Buyers in India: ఫస్ట్ టైమ్ కారు కొంటున్నారా ? ఏ కారు కొనాలి ? ఎలాంటి కారు కొనాలి  ? ఏ కారులో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి  ? ఏ కారు అయితే తక్కువ ధరలో వస్తుంది  ? తొలిసారి కారు కొనేవారికి ఎలాంటి కారు అయితే సరిగ్గా సూట్ అవుతుంది  ? ఇలా రకరకాల ఆలోచనలు మీ మెదడుని తొలిచేస్తున్నాయి కదా  ? అయితే, డోంట్ వర్రీ.. ఇదిగో ఈ డీటేల్స్ మీ కోసమే. ఫస్ట్ టైమ్ కారు కొనుగోలు చేసే వారికి సెర్చ్ ఆపరేషన్ ఈజీ చేయడం కోసం అందిస్తున్న డీటేల్స్ ఇవి. మరి ఇంకెందుకు ఆలస్యం.. కమాన్ లెట్స్ చెకౌట్ దీజ్ డీటేల్స్.

హ్యూండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారు :
హ్యాండాయ్ ఐ10 కారు మోడల్లో చివరిగా లాంచ్ అయిన వేరియంట్ కారు పేరే ఈ హ్యూందాయ్ i10 నియోస్. తక్కువ ధరలో రిచ్ ఫీచర్స్, అధిక మైలేజ్ ఇచ్చే కార్లలో హ్యూండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఒకటి. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌తో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టం టెక్నాలజీ, రీయర్ పార్కింగ్ కెమెరా, వైర్లెస్ ఫోన్ చార్జింగ్ వంటి అత్యాధునిక ఫీచర్స్ ఈ కారు సొంతం. మ్యాన్వల్ ట్రాన్స్‌మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్స్‌లో లభించే ఈ కారు బేసిక్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర కేవలం రూ. 5.73 లక్షలు మాత్రమే.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారు :
చూడ్డానికి ఎస్ యూవీ కారు మోడల్ ని పోలి ఉండే ఈ కారు కాంపాక్ట్ ఎస్ యూవీ కేటగిరీలోకి వస్తుంది. కాంపాక్ట్ ఎస్ యూవీ అంటే తెలిసిందే కదా.. హ్యాచ్ బ్యాక్ కంటే పెద్దది.. ఎస్ యూవీ కంటే చిన్నది.. ఈ రెండింటి మధ్య రకానికి చెందిన కారునే కాంపాక్ట్ ఎస్ యూవీ కారుగా పిలుస్తాం. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారులో పెట్రోల్ వేరియంట్ అయితే 24 Kmpl మైలేజ్, సీఎన్జీ వేరియంట్ అయితే 32.73 km/kg మైలేజ్ ఇస్తుంది. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్మెంట్, రిమోట్ లెస్ కీ ఎంట్రీ, స్పీడ్ అలర్ట్ సిస్టం వంటి ఫీచర్స్ ఉన్న ఈ కారు బేసిక్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర కేవలం రూ. 4.27 లక్షలు మాత్రమే. 

మారుతి సుజుకి వాగాన్ఆర్ కారు :
విశాలమైన, ఎత్తయిన క్యాబిన్ ఉండే అతి కొద్ది కార్లలో వ్యాగాన్ఆర్ ఒకటి. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌తో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టం టెక్నాలజీ, రీయర్ పార్కింగ్ సెన్సార్స్, 7 అంగుళాల రిమోట్ లెస్ కీ ఎంట్రీ, స్పీడ్ అలర్ట్ సిస్టం వంటి అత్యాధునిక ఫీచర్స్ ఈ కారు సొంతం. మారుతి సుజుకి వ్యాగాన్ఆర్ కారు బేసిక్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర కేవలం రూ. 5.52 లక్షలు మాత్రమే.

టాటా టియాగో కారు :
టాటా టియాగో కారు ఎప్పుడూ వార్తల్లో ఉండే కార్లలో ముందుంటుంది. తక్కువ ధరలో సీఎన్జీ వెర్షన్, ఎలక్ట్రిక్ వేరియంట్ లభించే ఏకైక కారు టాటా టియాగో. ఇందులో కూడా డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌తో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టం పరిజ్ఞానం ఉన్న ఈ కారులో సేఫ్టీ పరంగానూ 4 స్టార్ రేటింగ్ ఉంది. ఈ కారు బేసిక్ వేరియంట్ ఆరంభ ధర రూ. 5.6 లక్షలు మాత్రమే.

రెనాల్ట్ క్విడ్ కారు :
చూడ్డానికి చిన్నపాటి ఎస్ యూవీ కారును పోలినట్టుగా కనిపించే చిన్న కార్లలో రెనాల్ట్ క్విడ్ కారు కూడా ఒకటి. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్మెంట్ వంటి ఫీచర్స్ ఉన్న ఈ కారు మ్యాన్వల్ ట్రాన్స్‌మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్.. రెండూ వేరియంట్స్‌లోనూ లభిస్తుంది. ఈ కారు బేసిక్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర కేవలం రూ. 4.7 లక్షలు మాత్రమే.

మహింద్రా XUV300 కారు : 
మహింద్రా కార్లు అంటేనే ఒకింత రాజసం ఉట్టిపడే కార్లు. అందులోనూ మహింద్రా XUV300 కారు చూడ్డానికి SUV లుక్ లో కనిపించే కారు. అందుకే మహింద్రా XUV300 కారుకు అనతి కాలంలోనే మంచి క్రేజ్ కనిపించింది. మ్యాన్వల్ ట్రాన్స్‌మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్స్‌లో లభించే ఈ కారు బేసిక్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర కేవలం రూ. 8.42 లక్షలుగా ఉంది.

ఇది కూడా చదవండి : Discontinued Cars & SUVs In 2023: 2023 నుంచి తయారీ ఆగిపోయిన కార్ల జాబితా

హోండా అమేజ్ కారు : 
తక్కువ ధరలో విశాలమైన స్పేస్ ఉండే సెడాన్ కార్లలో హోండా అమేజ్ కారు ముందుంటుంది. 10 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు వారంటీ ఇచ్చే అతి కొద్ది కార్లలో హోండా అమేజ్ కారు కూడా ఒకటి. కేవలం రూ. 7.05 లక్షల ఎక్స్ షోరూం ధరతో ఆరంభం అయ్యే ఈ కారులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇక మైలేజ్ విషయానికొస్తే.. 18.6 KMPL మైలేజ్ ఇస్తుంది. ఎప్పటికప్పుడు మార్కెట్లోకి లాంచ్ అవుతున్న కొత్త కొత్త కార్లతో పాటు కార్లకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వార్తలు కోసం జీ తెలుగు న్యూస్ వెబ్‌సైట్ చదవండి.

ఇది కూడా చదవండి : Hyundai Exter Vs Maruti Suzuki Fronx: హ్యూందాయ్ ఎక్స్‌టర్ vs మారుతి సుజుకి ఫ్రాంక్స్.. రెండింట్లో ఏది బెటర్ కారు ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News