Aadhaar Card Security: అన్నింటికీ ఆధారమైన ఆధార్ కార్డు ఇప్పుడు చాలా ఎక్కువగా దుర్వినియోగమౌతోంది. ఈ మాటలు చెప్పింది సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం. అందుకే సురక్షితంగా ఎలా ఉంచుకోవాలో సూచిస్తోంది.
ఆధార్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఆధార్ జాగ్రత్తలు, సురక్ష గురించి వివరించింది. ఆధార్ కార్డు. నిత్య జీవితంలో ప్రతి పనికీ ఆధారమైన కార్డు ఎక్కువగా దుర్వినియోగమౌతోందని..కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కీలకమైన సూచనలు జారీ చేసింది. ఆధార్ కార్డు జిరాక్స్ కాపీనైనా సరే ఎవరితోనూ ఎప్పుడూ షేర్ చేసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ కార్డు కాపీ దుర్వినియోగమవుతోందని చెబుతోంది. యూఐడీఏఐ జారీ చేసిన ప్రెస్ రిలీజ్లో ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ దుర్వినియోగంపై సూచనలు జారీ అయ్యాయి.
వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో డాక్యుమెంటేషన్ ప్రోసెస్‌లో భాగంగా ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేసేటప్పుడు జాగ్రత్త, తెలివి అవసరమంటోంది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్. బయట పబ్లిక్ ప్రదేశాల్లో ఆధార్ కార్డును డౌన్లోడ్ చేయవద్దని కూడా చెబుతోంది. ఒకవేళ అలా చేయాల్సి వస్తే..సంబంధిత సిస్టమ్ నుంచి ఈ కాపీలను రీ సైకిల్ బిన్‌తో సహా డిలీట్ చేయించమని సూచిస్తోంది.
ఆధార్ కార్డుని వివిధ రకాలుగా విభిన్న వ్యక్తులు దుర్వినియోగం చేసే అవకాశముందని ప్రజల్ని హెచ్చరిస్తోంది. వివిధ సంస్థలకు ఆధార్ కార్డు కాపీ షేర్ చేయడం తప్పనిసరైతే మాత్రం..ఆ సంస్థలు ఆమోదయోగ్యమైనవో కాదో నిర్ధారించుకోవల్సిన అవసరముందని సూచిస్తోంది. హోటర్స్, సినిమా హాల్స్ వంటి ప్రదేశాల్లో ఆధార్ కార్డు కాపీలు సేకరించడంపై నియంత్రణ ఉంది. ఒకవేళ ఆ సంస్థలు అలా చేస్తే..ఆధార్ చట్టం 2016 ప్రకారం అది నేరంగా పరిగణిస్తారు.
ఆధార్ కార్డును సురక్షితంగా ఎలా ఉంచాలి
అందుకే మాస్క్ ఆధార్ కార్డును మాత్రమే షేర్ చేయాలని సూచిస్తోంది. ఈ విధానంలో చివరి నాలుగు ఆధార్ అంకెలే కన్పిస్తాయి. ఆధార్ నెంబర్ పూర్తిగా ఉంటే మాత్రం ఎవరైనా సరే యూఐడీఏఐ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వీలుంది. డౌన్లోడ్ చేసేముందు..మాస్క్డ్ ఆధార్ కార్డు కావాలా అనే ఆప్షన్ ఎంచుకోమని సూచిస్తోంది.
ఆధార్ నెంబర్‌ను సురక్షితంగా వెరిఫై చేసుకునే విధానాన్ని కూడా యూఐడీఏఐ సూచిస్తోంది. ఆఫ్‌లైన్‌లో విధానంలో కూడా వెరిఫికేషన్ దశ సాధ్యమే. దీనికోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎంఆధార్ మొబైల్ యాప్ ద్వారా సాధ్యమవుతుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంది ఈ యాప్. ఆధార్ అనేది దేశంలో అంతర్గతంగా ఉపయోగించే కీలకమైన డాక్యుమెంట్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల్ని పాటిస్తూ మీ ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా చూసుకోవల్సిన బాధ్యత మీపైనే ఉంది.
Also read: Sovereign Gold Bond Scheme: ప్రభుత్వ స్కీమ్‌లో పెట్టుబడి, ప్రతి ఆరు నెలలకు రిటర్న్ గ్యారంటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook