Central Government on Phone Tracking: మొబైల్ దొంగలకు కేంద్రం చెక్ పెట్టనుంది. ఇక నుంచి మొబైల్ చోరీకి గురైనా.. పోగొట్టుకున్నా దాన్ని వెంటనే బ్లాక్ చేసే విధంగా కొత్త టెక్నాలజీని కేంద్రం ప్రభుత్వం తీసుకురానుంది. మొబైల్ నెట్‌వర్క్‌లు తమ దగ్గర ఉన్న ఈఎంఈఐ నంబర్ ఆధారంగా ఫోన్‌లను ట్రాక్ చేసి బ్లాక్ చేస్తాయి. ఇందుకు కోసం కేంద్ర ప్రభుత్వం మానిటరింగ్ సిస్టమ్ (ట్రాకింగ్ సిస్టమ్)ను ప్రారంభించబోతోంది. సరికొత్త పద్ధతి ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలు తమ ఫోన్లు పొగొట్టుకున్నా.. దొంగతనానికి గురైనా బ్లాక్ లేదా ట్రేస్ చేయవచ్చని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. మొబైల్‌ను బ్లాక్ చేస్తే అవి పనిచేయవని.. తద్వారా దొంగతనాలు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పారు. టెక్నాలజీ డెవలప్‌మెంట్ బాడీ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ డెవలప్ చేసిన టెక్నాలజీని ఈ నెల 17వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
సీ-డాట్ ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఈశాన్య ప్రాంతంతో సహా కొన్ని టెలికామ్ సర్కిల్‌లలో ప్రయోగాత్మక ప్రాతిపదికన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) వ్యవస్థను అమలు చేస్తోంది. ఇప్పుడు ఇదే పద్ధతిని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. సీ-డాట్ సీఈఓ, ప్రాజెక్ట్ బోర్డ్ ఛైర్మన్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ ప్రారంభ తేదీపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ సాంకేతికతను పాన్ ఇండియాలో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.
మానిటరింగ్ సిస్టమ్ రెడీగా ఉందని.. ఈ త్రైమాసికంలో దేశం అంతటా అమలు చేస్తున్నట్లు ఉపాధ్యాయ్ తెలిపారు. అన్ని టెలికామ్ నెట్‌వర్క్‌లలో క్లోన్ చేసిన మొబైల్ ఫోన్‌ల వినియోగాన్ని ట్రేస్ చేయడానికి సీ-డాట్ కొత్త ఫీచర్‌లను యాడ్ చేసినట్లు చెప్పారు. మన దేశంలో మొబైల్ పరికరాలను విక్రయించే ముందు ఈఎంఈఐ నంబరు బహిర్గతం చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ప్రతి మొబైల్ నెట్‌వర్క్.. తమ నెట్‌వర్క్‌లోకి అనధికారిక మొబైల్ ఫోన్ ఎంట్రీని గుర్తించడానికి ఈఎంఈఐ నంబర్‌ల జాబితాను కలిగి ఉంటాయి. ఈ నంబర్లను టెలికామ్ ఆపరేటర్లు సీఈఐఆర్ సిస్టమ్ ద్వారా ట్రేస్ చేసి ఎక్కడ ఉన్నా.. ట్రేస్ చేసి బ్లాక్ చేస్తాయి.
Also Read: Sunisith: చరణ్ ఫాన్స్ చేతుల్లో చావు దెబ్బలు తిన్న సునిషిత్ మమూలోడేమీ కాదు..ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉందా?
Also Read: Bandi Sanjay: రజాకార్ల రాజ్యాన్ని పాతరేస్తాం.... రామరాజ్యాన్ని స్థాపిస్తాం: బండి సంజయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి