Budget 2023: భారీ ఉపశమనం.. ట్యాక్స్‌పేయర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త..!

Budget 2023 Income Tax: ఈ సారి బడ్జెట్‌లో ట్యాక్స్‌పేయర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశం కనిపిస్తోంది. ఇన్‌కమ్ ట్యాక్స్ పరిమితిపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్‌లో 80సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. మరింత మందికి ఉపశమనం కలగనుంది. ఎలాగంటే..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2023, 09:43 PM IST
Budget 2023: భారీ ఉపశమనం.. ట్యాక్స్‌పేయర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త..!

Budget 2023 Income Tax: కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా.. ప్రజలకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి ప్రభుత్వం జీతభత్యాల తరగతికి 80సీ కింద పెట్టుబడి మినహాయింపును పెంచవచ్చని ప్రచారం జరుగుతోంది. జీతం పొందే వ్యక్తులు పన్నును ఆదా చేయడానికి ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబ్‌లో 80సీ కీలకం. ప్రభుత్వం ఈ విభాగంలో మినహాయింపు పరిమితిని పెంచినట్లయితే.. మరింత మందికి ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతం 80సీ కింద 1.6 లక్షల తగ్గింపు అందుబాటులో ఉంది. ప్రభుత్వం ఈ మినహాయింపు పరిమితిని ఏటా రూ.2 లక్షలకు పెంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ, 80సీసీసీ, 80సీసీడీ కింద ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల వరకు మినహాయింపు లభిస్తోంది. అయితే కంపెనీ, కార్పొరేట్‌పై ఈ మినహాయింపు అందుబాటులో లేదు. ఈ మినహాయింపు కోసం జూలై 31లోపు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయవచ్చు. 80సీలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), మ్యూచువల్ ఫండ్, ప్రీమియం ఇన్సూరెన్స్-సేవర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉన్నాయి. అదే సమయంలో 80సీసీసీ కింద కొన్ని ప్రత్యేక పాలసీలు ఉన్నాయి. ఇవి యాన్యుటీ, పెన్షన్ కోసం చెల్లిస్తాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్‌) 80సీసీడీలోకి వస్తుంది. 

ఎంత ప్రయోజనం ఉంటుంది

ఈసారి బడ్జెట్‌లో జీతభత్యాల కోసం ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం 80సి కింద మినహాయింపు పరిమితిని ఏటా రూ.2 లక్షలకు పెంచవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉదాహారణకు ఎవరికైనా మొత్తం రూ.10 లక్షల జీతం ఉంటే.. ప్రతి ఒక్కరికీ రూ.2.5 లక్షల రాయితీ ఇస్తారు. రూ.50 వేలు స్టాండర్డ్ డిడక్షన్‌గా లభిస్తుంది. అంటే మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.7 లక్షలు.

మీరు రూ. 1.5 లక్షల మినహాయింపును క్లెయిమ్ చేస్తే.. అప్పుడు పన్ను పరిధిలోకి వచ్చే మొత్తం రూ. 5.5 లక్షలు అవుతుంది. 80సీ కింద ప్రభుత్వం మినహాయింపు పరిమితిని 1.5 లక్షల నుంచి 2 లక్షలకు పెంచితే.. 10 లక్షల జీతం ఉన్న వ్యక్తి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం 5 లక్షలు అవుతుంది. ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రకారం.. 2.5 లక్షల నుంచి 5 లక్షల మధ్య వార్షిక ఆదాయం 5 శాతం చొప్పున పన్ను వసూలు చేస్తున్నారు. పరిమితి పెంపు వల్ల 10 లక్షల జీతం ఉన్న వ్యక్తికి మరో 2500 రూపాయలు ఆదా అవుతుంది.  

Also Read: Vijayashanthi: ఆ రోజు ఏడ్చాను.. రాక్షసుడు ఎదురయ్యాడు.. టార్చర్ అనుభవించా: విజయశాంతి ఎమోషనల్  

Also Read: Unstoppable Pawan Kalyan Promo: మూడు పెళ్లిళ్లపై అడిగేసిన బాలయ్య.. పవన్ కళ్యాణ్ సమాధానం ఇదే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News