BSNL Recharge Plans: తమ కస్టమర్ల కోసం ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్లను పరిచయం చేస్తోంది. తమ వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లవైపు వెళ్లకుండా కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే అన్‌లిమిటెడ్ కాల్స్, హైస్పీడ్ డేటా ప్లాన్స్‌ను తీసుకురాగా.. తాజాగా దీర్ఘ కాల వ్యాలిడిటీతో చౌక రీఛార్జ్ ప్లాన్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ ప్లాన్ 321 రూపాయలతో ఉంటుంది. ఈ ప్లాన్‌లో లోకల్ కాల్స్‌కు నిమిషానికి 7 పైసలు, ఎస్‌డీకాల్స్‌కు నిమిషానికి 15 పైసలు ఛార్జ్ చేస్తారు. రూ.321 ప్లాన్ వ్యాలిడిలీ 365 రోజుల వరకు ఉంటుంది. ఇంత లాంగ్ వాలిడిటీ ప్లాన్‌ను ఇతర టెలికాం సంస్థలు ఏదీ ఇంత తక్కువ ధరలో అందించడం లేదు.
అయితే ఈ ప్లాన్‌లో బీఎస్‌ఎన్ఎల్ మరో ట్విస్ట్ ఉంది. ఇది అందరూ కస్టమర్లందరికీ అందుబాటులో ఉండదు. అయితే ఈ ప్లాన్‌లో రోమింగ్ ఇన్‌కమింగ్ వాయిస్ కాల్స్ ఉచితంగా లభిస్తాయి. ఇందుకు ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు. దీంతోపాటు ప్రతి నెలా 250 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పొందుతారు. అదేవిధంగా ప్రతి నెల 15 జీవీ ఉచిత ఇంటర్నెట్ డేటాను కూడా అందిస్తోంది బీఎస్‌ఎన్ఎల్.
ఈ ప్లాన్‌ను తమిళనాడులో పనిచేస్తున్న పోలీసు అధికారుల కోసం బీఎస్ఎన్‌ఎల్ తీసుకువచ్చింది. అంటే.. తమిళనాడులో పోలీసు అధికారులకు మాత్రమే రూ.321 తో రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్ తమిళనాడు సర్కిల్ కోసం బీఎస్ఎన్ఎల్ తన అధికారిక వెబ్‌సైట్‌లో సమాచారం అందించింది. ఇతర రీఛార్జ్ ప్లాన్‌ల కోసం బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఉచితంగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్ యాక్సెస్‌ను పొందే ప్లాన్‌ను కూడా బీఎస్‌ఎన్ఎల్ అందుబాటులో ఉంచింది. ఉచిత ఎస్‌ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాల్స్, డేటాకు సంబంధించిన ప్లాన్స్‌ను కూడా ఇతర టెలికాం సంస్థలకు దీటుగా తీసుకువచ్చింది.
Also Read: Janjatiya Vikas: జీ మీడియా ఆధ్వర్యంలో ఈ నెల 5న 'జనజాతీయ వికాస్'.. వేడుకల్లో భారీగా పాల్గొనండి
Also Read: Tomato Price Today: టమాట ధరలకు మరింత రెక్కలు.. కేజీ ట్రిబుల్ సెంచరీ దిశగా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook